అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రం ప్రేక్షకులని ఉర్రూతలూగిస్తూ విజయపథంలో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్ లో కూడా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బ్రహ్మరథం పడుతున్నారు. 

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ సంబరాల్లో మునిగితేలుతోంది. ఆదివారం రోజు అల వైకుంఠపురములో చిత్ర యూనిట్ వైజాగ్ లో సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. వైభవంగా జరిగిన ఈ వేడుకలో అల్లు అర్జున్, త్రివిక్రమ్, పూజా హెగ్డే.. నిర్మాతలు రాధాకృష్ణ, అల్లు అరవింద్, సంగీత దర్శకుడు తమన్, ఇతర చిత్ర యూనిట్ హాజరయ్యారు. 

సినిమా అఖండ విజయం సాధించడంతో ఈ చిత్రంలో భాగమైనవారంతా తమ సంతోషాన్ని పంచుకున్నారు. తమన్ ఎపుడూ లేని విధంగా ఫుల్ జోష్ లో వేదికపై ప్రశ్నగించాడు. తమన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చిన్నపాటి వివాదానికి తెరతీశాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో తమన్ కామెంట్స్ పై చర్చ జరుగుతోంది. 

మొదట త్రివిక్రమ్ గారు ఈ చిత్రం కోసం నన్ను ఎంపిక చేసుకోగానే చాలా సంతోషం అనిపించింది. సినిమా ప్రారంభానికి ముందు నాకు 100 మిలియన్ల పాట కావాలి అని బన్నీ అడిగాడు. టెన్షన్ పడుతూనే ఓకె చెప్పా. అల్లు అర్జున్ ఏ ముహూర్తంలో అడిగాడో కానీ ఈ చిత్రంలో ప్రతి సాంగ్ 100 మిలియన్ల వైపు దూసుకుపోతోంది అని తమన్ అన్నాడు. 

కుర్ర హీరోయిన్ ఛాన్స్ లాగేసుకున్న ప్రియమణి.. స్టార్ హీరో సినిమాలో!

ఈ చిత్రం కోసం దాదాపు 200 మందికి పైగా మ్యుజీషియన్లు పనిచేశారని తమన్ అన్నాడు. సినిమా విజయం సాధించడంతో ఆ ఫ్యామిలీలంతా సంతోషంగా ఉన్నాయి. సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నప్పుడు తమిళ చిత్రాలతో పాటు తెలుగు చిత్రాల నుంచి కూడా పోటీ ఎదురైంది. పోటీని తట్టుకుని నిలబడ్డాం. నిజమైన మ్యూజిక్ అందించాం.. నిజమైన కలెక్షన్స్ మాత్రమే చెబుతాం.. గెలిచాం.. కొట్టాం అని తమన్ వేదికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

తమన్ తన వ్యాఖ్యలతో మరో చిత్రాన్ని టార్గెట్ చేశాడా అనే చర్చ జరుగుతోంది. మరికొందరు మాత్రం తమన్ వ్యాఖ్యల్లో ఎలాంటి వివాదం లేదని.. సినిమా విజయం సాధించిన సంతోషంలో సంగీతం గురించి, కలెక్షన్స్ గురించి కామెంట్స్ చేశాడని అంటున్నారు.