వెండితెరపై క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాలకు ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన వెంకటేష్ గురు చిత్రం, టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ మూవీ ఎంఎస్ ధోని లాంటి చిత్రాలన్నీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఇటీవల కాలంలో ఎక్కువగా స్పోర్ట్స్ చిత్రాలు వస్తున్నాయి. 

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఫుట్ బాల్ క్రీడ కథాంశంతో 'మైదాన్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బదాయి హో చిత్రంతో ఘనవిజయం అందుకున్న దర్శకుడు రవీంద్రనాథ్ శర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మొదటగా ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ గా సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ని ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ తల్లి పాత్రలో నటించాల్సి ఉంటుంది. రీసెంట్ గా కీర్తి సురేష్ బరువు కూడా బాగా తగ్గింది. 

తొలి రోజు షూటింగ్ లో ఆ పాత్రలో ఆమె ఫిట్ అయినట్లు అనిపించలేదట. కీర్తి సురేష్ యంగ్ గా ఉండడం వల్ల తల్లి పాత్రకి సరిపోదని చిత్ర యూనిట్ భావించారు. కీర్తి సురేష్ కూడా వారి వాదనతో ఏకీభవించింది. దీనితో ఆమె మైదాన్ చిత్రం నుంచి తప్పుకుంది. 

చిరంజీవికే సపోర్ట్ చేసిన సుమన్.. రాజశేఖర్ గురించి అలా..!

దీనితో కీర్తి సురేష్ స్థానంలో మరో సౌత్ హీరోయిన్ ప్రియమణిని ఎంపిక చేసుకున్నారు. ప్రియమణి జాతీయ అవార్డు గెలుచుకోవడంతో పాటు సౌత్ లో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది. పెళ్లయ్యాక ప్రియమణికి హీరోయిన్ గా ఆఫర్స్ తగ్గాయి. సెకండ్ ఇన్నింగ్స్ మైదాన్ చిత్రం ప్రియమణికి మంచి అవకాశం అని చెప్పొచ్చు. 

వైరల్ ఫొటోలు : చీరకట్టులో జాన్వీ సెక్సీ లుక్, చూసే కళ్లదే లక్

1950లో ఫుట్ బాల్ క్రీడకు మంచి క్రేజ్ ఉండేది. ఆ సమయంలో సయ్యద్ అబ్దుల్ రహీమ్ ఇండియా ఫుట్ బాల్ టీం కు కోచ్ గా పనిచేశారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా మైదాన్ చిత్రం తెరక్కుతోంది. సయ్యద్ పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నారు.