సౌత్ టాప్ దర్శకులలో మురుగదాస్ ఒకరు. మురుగదాస్ చివరగా తెరకెక్కించిన దర్బార్ చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోయింది. దీనితో మురుగదాస్ ఈసారి గట్టిగా కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. మురుగదాస్ తదుపరి చిత్రం ఇళయదళపతి విజయ్ తో అనే టాక్ నడుస్తోంది. 

వీరిద్దరి కాంబోలో తుపాకీ, సర్కార్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబోలో తెరకెక్కబోయే చిత్రం తుపాకీకి సీక్వెల్ అనే ప్రచారం కూడా సాగుతోంది. మురుగదాస్ ఇప్పటివరకు ఏఆర్ రెహమాన్, హరీష్ జైరాజ్, అనిరుద్ లాంటి సంగీత దర్శకులతో పనిచేశారు. 

కేజ్రీవాల్ కు మొరపెట్టుకున్న పవన్ హీరోయిన్.. తండ్రిని కత్తితో బెదిరించి..

ప్రస్తుతం తమన్ టాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఈసారి మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చాలనే ఆలోచనలో ఉన్న మురుగదాస్.. తమన్ పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అల వైకుంఠపురములో చిత్రానికి తమన్ అందించిన సంగీత దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. 

దీనితో మురుగదాస్ కూడా తమన్ పట్ల ఆసక్తిగా ఉన్నట్లు టాక్. అన్ని కుదిరితే మురుగదాస్, విజయ్ క్రేజీ కాంబోలో తమన్ అవకాశం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.