హాట్ బ్యూటీ మీరా చోప్రా తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ సరసన బంగారం చిత్రంలో నటించిన మీరా చోప్రా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత వాన, గ్రీకువీరుడు లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. 

ప్రస్తుతం మీరా చోప్రా సినిమాల జోరు తగ్గించింది. బంగారం మూవీలో మీరా చోప్రా చలాకి నటన యువతని ఆకర్షించింది. ఇదిలా ఉండగా మీరా చోప్రా ఇటీవల తన తండ్రికి జరిగిన చేదు సంఘటనని వివరించింది. 

శ్రీదేవి ముందు నిలబడాలంటే నాకు మాసిన గడ్డమే కరెక్ట్ : చిరంజీవి

తన తండ్రి ఢిల్లీలోని పోలీస్ కాలనీలో ఫోన్ మాట్లాడుతూ వాకింగ్ చేస్తున్నారు. స్కూటర్ పై వచ్చిన ఇద్దరు దుండగులు తన తండ్రిని కత్తితో బెదిరించి ఫోన్ దొంగిలించి వెళ్లారని మీరా చోప్రా వాపోయింది. 

ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలియజేస్తూ ఢిల్లీ పోలీసులకు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మొరపెట్టుకుంది. ఢిల్లీలో అత్యంత సేఫ్ ప్లేస్ గా భావించే ప్రాంతంలోనే ఈ ఘటన జరగడం శోచనీయం అని మీరా చోప్రా తెలిపింది. మీరా చోప్రా ట్వీట్ కు స్పందించిన ఢిల్లీ పోలీసులు కేసుని విచారణ చేస్తున్నారు.