చాలా కాలం తర్వాత ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో మంచి సక్సెస్‌ అందుకున్న సందీప్‌ కిషన్‌, తాజాగా తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిను వీడని నీడను నేనే సినిమా ముందు వరస ప్లాప్స్ తో సందీప్ కిషన్ మార్కెట్ పరిస్దితి ఏమీ బాగోలేదు. దాంతో నిను వీడని నేనే సినిమాతో ఊపిరి పీల్చుకున్న సందీప్ కిషన్ ..  తెనాలి రామకృష్ణ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా కూడా సందీప్‌కి షాకిచ్చింది.

రూ.200 ల బట్టలే వేసుకుంటా.. స్టార్ హీరో కామెంట్స్!

తెనాలి రామకృష్ణ మొదటి షో నుంచే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది.  అప్పటికీ సందీప్ కిషన్ తన శాయశక్తులా ఈ సినిమా ప్రమోషన్స్ చేసాడు. జనాల్లోకి ఎంతగా తీసుకెళ్లినా.. తెనాలి రామకృష్ణకి చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ రాలేదు. దానికి తోడు... సినిమాకు వచ్చిన టాక్‌తో   ఓ మాదిరి కలెక్షన్స్ రావడం కూడా కష్టమైపోయింది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ మూడు రోజుల్లో కేవలం కోటి యాభై ఐదు లక్షల షేర్ మాత్రమే సాధించింది. ఏరియా వైజ్ చూస్తే..

ఏరియా                                 షేర్ (కోట్లలో)

--------------------                ----------------------------------------

నైజాం                                    0.59

సీడెడ్                                    0.17

నెల్లూరు                                0.08

కృష్ణా                                    0.15

గుంటూరు                            0.12

వైజాగ్                                  0.20

ఈస్ట్ గోదావరి                       0.14

వెస్ట్ గోదావరి                        0.10

మొత్తం ఆంధ్రా,తెలంగాణా షేర్ రూ. 1.55 కోట్లు.. ఇక జి. నాగేశ్వర రెడ్డి ఓల్డ్ కామెడీని నమ్ముకున్న సందీప్ కిషన్ ఘోరంగా దెబ్బతిన్నాడు. అల్లరి నరేష్ చెయ్యాల్సిన కామెడీని సందీప్ కిషన్ చేయాడని విమర్శలు వచ్చాయి.  చెట్టుకింద ప్లీడరు‌గా సందీప్ నటన బానే చేసినా హీరోయిన్ హన్సిక ఈ సినిమాకి మెయిన్ మైనస్ గా నిలచింది. ఏదైతేనేం  సందీప్ కిషన్‌ని ఈ తెనాలి రామకృష్ణ కాపాడలేకపోయాడు.