ప్రస్తుతం ఉన్న సొసైటీలో బ్రాండ్ లకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో చెప్పనక్కర్లేదు. ప్రతీ ఒక్కరూ కాస్ట్లీ బట్టలు, ఫోన్లు వాడాలనే చూస్తుంటారు.ఇక మన సెలబ్రిటీల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో స్టైలిష్ గా కనిపించడానికి ఆసక్తి చూపుతుంటారు.

కానీ ఓ స్టార్ హీరో మాత్రం తను రెండు వందల రూపాయలు విలువ చేసే బట్టలే వేసుకుంటానని చెబుతున్నాడు. కన్నడ సూపర్ స్టార్ సుదీప్ తెలుగు, హిందీ భాషల్లో కూడా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే రేంజ్ లో రెమ్యునరేషన్ కూడా  అందుకుంటున్నాడు.

ప్రొఫెసర్ గా క్రేజీ  హీరో.. స్టూడెంట్స్ గా అందాల భామలు.. స్టోరీ లీక్!

అయితే తన వ్యక్తిగత జీవితంలో చాలా మార్పు వచ్చిందని చెబుతున్నాడు ఈ హీరో. ఆర్భాటాలు అవసరం లేదని గ్రహించినట్లుగా సుదీప్ వివరించాడు. ఇప్పుడు తను వేసుకునే టీషర్ట్ ల విలువ కూడా రెండు మూడు వందల రూపాయలే ఉంటుందని చెబుతున్నాడు సుదీప్. తన వ్యక్తిగత జీవితంలో లగ్జరీలు ఏమీ ఉండవని తేల్చి చెప్పాడు సుదీప్.

ఇప్పుడు విలువైన వస్తువులను వాడి, కటౌట్ లు చూసుకొని మురిసిపోయే మానసిక స్థితిలో తను లేనని సుదీప్ వెల్లడించాడు. ఒకసారి తన పుట్టినరోజు నాడు  అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారని.. ఆ సమయంలో తను బాగా ఎంజాయ్ చేశానని చెప్పాడు సుదీప్.

పార్టీ అయిన తరువాత ఒక వీధి బాలిక కింద పడిపోయిన కేక్ ను ఏరుకొని తినడాన్ని గమనించినట్లు చెప్పాడు సుదీప్. ఆ దృశ్యం తనను తీవ్రంగా కలిచి వేసిందని.. అప్పటినుండి బర్త్ డే హంగామా చేయడం ఆగిపోయిందని చెప్పాడు. ఒక వేళ ఫ్యాన్స్ గనుక తన పుట్టినరోజు వేడుకలు జరపాలనుకుంటే వాళ్ల ఇంటి దగ్గరే కేక్ కట్ చేసి.. వాళ్ల వీధిలో పంచమని చెబుతున్నట్లు సుదీప్ వెల్లడించాడు. ఇటీవల విడుదలైన 'సైరా'  సినిమాలో సుదీప్ కీలకపాత్ర పోషించాడు.