చిరంజీవి ఎంతో ఇష్టపడి, ఎంతో ప్రతిష్ట్మాకంగా తెరకెక్కించిన సైరా సందడి రిలీజైన కొద్ది రోజులుకే అణిగిపోయింది. రెండేళ్ల నిరీక్షణకు సైరా మంచి ఫలితమే ఇచ్చిందని చెప్పుకున్నా చాలా చోట్ల నష్టాలే మిగిలాయని ట్రేడ్ వాపోయింది. మెగా ఫ్యాన్స్‌కి మాత్రమే కాదు... అందరికి సైరా సినిమా నచ్చిందన్నారు. కానీ వసూళ్లు చూస్తే డిస్ట్రిబ్యూటర్స్ కు కన్నీళ్లు వచ్చాయి.

రిలీజై కు మందు మంచి లాభాలకు అమ్మి...తండ్రి సినిమాలతో  లాభాలు మూట గట్టుకుంటున్న రామ్ చరణ్ కి ఏమోకానీ.. సై రా సినిమాని భారీ రేట్లకి కొనుగోలు చేసిన బయ్యర్ల పరిస్దితి గందరగోళం అయ్యిపోయింది. చిరు స్టామినాతో అధిక రేట్లకు కొన్న బయ్యర్లకు చుక్కలు కనబడ్డాయి. మరి ముఖ్యంగా అమెరికాలో ఈ చిత్రం కేవలం 2.5 మిలియన్ గ్రాస్ అంటే 17 కోట్లు మాత్రమే వసూలు చేసిందని రెన్ ట్రాక్ వాళ్లు తేల్చారు.

'రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి.. ఎవరెవర్నో పెడుతున్నారు'.. కార్తీ 'దొంగ' ట్రైలర్

రెన్ ట్రాక్ వాళ్లు చెప్పారంటే ఖచ్చితమైన లెక్కే ట్రేడ్ నమ్ముతుంది. వార్, అసురన్ సినిమాల దెబ్బ బాగా ఈ సినిమాకు తగిలినట్లు తేలింది. తెలుగు వాళ్లు సైతం ఆ రెండు సినిమాలు చూడటానికే ఆసక్తి చూపారు. దాంతో అక్కడ కొన్న డిస్ట్రిబ్యూటర్ కు బాగా లాస్ వచ్చిందని సమాచారం.

అన్ని భాషల్లో కలిపి 200 కోట్లకు పైగానే బిజినెస్ చేసిన సైరా నరసింహారెడ్డికి టోటల్ గా అంటే అన్ని ఏరియాలను కలిపి 50 కోట్ల నష్టాలు అని తేల్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తప్పితే సై రా సినిమా మరే భాషలోనూ సత్తా చాటలేకపోయింది.  తమిళ, మలయాళ, కన్నడలలో కూడా పర్వాలేదనింపించినా హిందీలో అయితే మరీ ఘోరం  ఓవరాల్‌గా సైరా బయ్యర్లకు 50 కోట్ల లాస్ వచ్చినట్లే. ఈ లాస్ ని చిరు తర్వాత సినిమాకు కూడా చరణే నిర్మాత కాబట్టి ఆ సినిమాకు చూసుకుందాం అన్నాడని సమాచారం.