స్టార్ హీరో సూర్య తమ్ముడిగా కార్తీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా కార్తీకి మంచి క్రేజ్ ఉంది. ఇటీవల కార్తీ 'ఖైదీ' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. అదే ఉత్సాహంతో మరో విభిన్నమైన చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

జీతూ జోసెఫ్ దర్శత్వంలో తెరకెక్కిన చిత్రం 'దొంగ'. ఈ చిత్రంలో కార్తీ అక్కగా సూర్య సతీమణి జ్యోతిక నటించడం విశేషం. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలయింది. ట్రైలర్ లోని ప్రతి అంశం సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. 'చిన్నా ఇంకా నా కళ్ళలోనే ఉన్నాడు.. నాకు ఇక్కడ ఉన్న ఒక్క సంతోషం, ఓదార్పు వాడు మాత్రమే' అంటూ జ్యోతిక చెప్పే ఎమోషనల్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. 

ఉత్కంఠరేకెత్తించే అంశాలతో పాటు సెంటిమెంట్ కూడా ఈ చిత్రంలో బాగానే ఉన్నట్లుంది. ట్రైలర్ మధ్యలో ' న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి..  ఎవరెవర్నో పెడుతున్నారు' అంటూ కార్తీ చెప్పే ఫన్నీ డైలాగ్ నవ్వులు పూయించే విధంగా ఉంది. 

నా పనైపోయిందని కామెంట్ చేశారు.. తప్పు నాదే: సాయిధరమ్ తేజ్!

చిన్నతనంలో ఇంటినుంచి పారిపోయిన కార్తీ 15 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులని కలుసుకుంటాడు. 'మీ అబ్బాయి గురించి నాకు లీడ్ దొరికింది.. వాడు చాలా డేంజరస్' బ్యాగ్రౌండ్ లో వినిపించే డైలాగ్ కార్తీ పాత్రపై ఆసక్తిని పెంచే విధంగా ఉంది. ఈ చిత్రంలో నిఖిల విమల్ కార్తీకి జోడిగా నటిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే కార్తీ మరో హిట్ కొట్టేలానే ఉన్నాడు. 

తండ్రయిన స్టార్ కమెడియన్.. సెలెబ్రిటీల శుభాకాంక్షల వెల్లువ!