Asianet News TeluguAsianet News Telugu

2019 : యుఎస్ లో హిట్టైన తెలుగు సినిమాలు ఇవే!

ఎఫ్ 2, ఓ బేబి, బ్రోచేవారెవరురా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ..ఈ నాలుగు సినిమాలు మాత్రమే ట్రేడ్ లో లాభాలు తెచ్చిపెట్టాయి. మిగిలినవన్ని ఎంతో కొంత కొనుక్కున్న వారికి నష్టం మిగిల్చినవే. 

Telugu hit movies in US Market Going Down in 2019
Author
Hyderabad, First Published Dec 28, 2019, 10:00 AM IST

చాలా కాలంగా యుఎస్ మార్కెట్ తెలుగు సినిమాకు బిజినెస్ పరంగా బాగా కలిసొస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగులో పెద్దగా ఆడని కొన్ని సినిమాలు కూడా అక్కడ ఆడాయి. అలాగే సినిమాకు ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ తో పాటు అక్కడ కలెక్షన్స్ కూడా చూసుకోవటం ఆనవాయితీ. దాంతో అక్కడ మార్కెట్ ని కూడా దృష్టిలో పెట్టుకునే బిజినెస్ లెక్కలు వేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా యుఎస్ మార్కెట్ పరిస్దితి బాగోలేదు. పెద్ద సినిమాలు అనుకున్నవి చీదేయటంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ చాలా దెబ్బ తిన్నారు.

ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్, నెట్ ప్లిక్స్ ప్రభావం బాగా కనపడుతోంది. అక్కడ థియేటర్ కు వెళ్లి సినిమా చూడటం కన్నా ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో చూడటమే బెస్ట్ అనే నిర్ణయానికి చాలా మంది వచ్చేసారు. ఇంతకు ముందులా రిలీజైన ప్రతీ సినిమాకు యుస్ లో ఉన్న మన తెలుగు వాళ్లు వెళ్లటం లేదు. టాక్, రివ్యూలు చూసుకుని, అమెజాన్ ప్రైమ్ రిలీజ్ డేట్ చూసుకుని లెక్కలు వేసుకుని కదులుతున్నారు. దాంతో అక్కడ అంతంత రేట్లు పెట్టి కొనుకున్న డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోవటం, ఆ ప్రభావం ఇక్కడ ఇండస్ట్రీపై పడటం జరుగుతోంది. గత సంవత్సరం 2018 లో  71 సినిమాలు యుఎస్ రిలీజ్ అయితే ఈ సంవత్సరం  ఆ సంఖ్య 49కు పడిపోయింది. అందుకు కారణం సక్సెస్ రేటు పడిపోవటమే.

2019 రివైండ్: స్వర్గస్తులైన టాలీవుడ్ సెలబ్రెటీలు

ఎఫ్ 2, ఓ బేబి, బ్రోచేవారెవరురా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ..ఈ నాలుగు సినిమాలు మాత్రమే ట్రేడ్ లో లాభాలు తెచ్చిపెట్టాయి. మిగిలినవన్ని ఎంతో కొంత కొనుక్కున్న వారికి నష్టం మిగిల్చినవే. ఇదే పరిస్దితి కంటిన్యూ అయితే అమెరికాలో తెలుగు సినిమాలు చేసే పంపిణీదారులు అనే వాళ్లు మిగలరు. అందుకోసం ఇక్కడ నిర్మాతలు కూడా నష్టం వస్తే రికవరీ ఇవ్వటం, రేట్లు మరీ పెంచేసి అమ్మకుండా రీజన్ బుల్ గా బిజినెస్ చేయటం వంటివి చేయాలి.

అలాగే అమెజాన్ ప్రైమ్ కు సినిమాలు ఇచ్చేటప్పుడు మరి రిలీజ్ అయిన కొద్ది రోజులుకే కాకుండా మినిమం 50 రోజులు తర్వాత మాత్రమే స్ట్రీమింగ్ జరిగేలా చూసుకోవాలి.  అప్పుడు మాత్రమే యుఎస్ లో సినిమాలు కమర్షియల్‌గా పే చేయగలుగుతాయి.భారీ వసూళ్లు మాట ఎలా ఉన్నా మినిమం గ్యారెంటీలో బయిటపడిపోతారు డిస్ట్రిబ్యూటర్స్. లాభాలు రాకపోయినా నష్టపోకపోతే..ఉన్నంతలో హ్యాపీగా ఉంటారు. మరిన్ని సినిమాలు రిలీజ్ చేసేందుకు ముందుకు వస్తారు.  .

Follow Us:
Download App:
  • android
  • ios