2019 ఇయర్ రౌండప్ : స్వర్గస్తులైన టాలీవుడ్ సెలబ్రెటీలు

First Published 28, Dec 2019, 9:47 AM

సినిమాలు హిట్ లు, ప్లాఫ్ ల సంగతి పక్కనపెడితే.. ఈ సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఈ లోకాన్ని విడిచి స్వర్గస్తులయ్యారు. 

సినిమాలు హిట్ లు, ప్లాఫ్ ల సంగతి పక్కనపెడితే.. ఈ సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఈ లోకాన్ని విడిచి స్వర్గస్తులయ్యారు. వీళ్లలో సీనియర్లే ఎక్కువగా ఉన్నప్పటికీ వారి మరణం తెలుగు పరిశ్రమకు తీరని లోటుగా మారింది. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడిన కమెడియన్ వేణు మాధవ్ కూడా హఠాన్మరణం చెందడం తెలుగు పరిశ్రమ మొత్తాన్ని కదిలించింది. ఇక ఈ సంవత్సరం టాలీవుడ్ నుంచి మనల్ని విడిచి వెళ్లిపోయిన వారు ఎవరెవరంటే

విజయ బాపినీడు: చిరంజీవితో ఎన్నో హిట్స్ కొట్టి, మెగాస్టార్ అనే మ్యాగజైన్ నడిపిన ప్రముఖ దర్శకనిర్మాత విజయ బాపినీడు ఈ ఏడాది ప్రారంభంలో పరమదించారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడిన ఆయన ఫిబ్రవరి 12న తుది శ్వాస విడిచారు. చిరంజీవితో పట్నం వచ్చిన పతివ్రతలు, మగ మహరాజు, మగధీరుడు, ఖైదీ నం.786, గ్యాంగ్ లీడర్, బిగ్‌బ్యాస్ వంటి చిత్రాలను తెరకెక్కించారు.

డీఎస్ దీక్షితులు : ప్రముఖ రంగస్థల నటుడు, సిని నటుడు డీఎస్ దీక్షితులు ఈ ఏడాది ఫిబ్రవరి 18న కన్నుమూశారు. ఓ సినిమా షూటింగ్‌లో ఉండగా ఆయనకు గుండెపోటు రావడంతో.. స్థానిక ఆసుపత్రికి తరలిస్తూండగా మార్గమధ్యంలోనే ఆయన ఈ లోకాన్ని వదలివెళ్లారు. మురారి సినిమాలో పూజారిగా కనిపించిన ఆయన పాత్రకు మంచి పేరు రాగా.. ఇంద్ర, ఠాగూర్, అతడు వంటి చిత్రాల్లోనూ ఆయన కనిపించి అలరించారు.

కోడి రామకృష్ణ: ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతి (64) సైతం ఈ సంవత్సరమే చెందారు. మరణానికి ముందు కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడి.. గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పిబ్రవరి 22 న తుది శ్వాస విడిచారు.ఆయన వందకుపైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ సినిమాలనూ తెరకెక్కించారు.

రాళ్లపల్లి: నాటక,చలన చిత్ర రంగంలో రాళ్లపల్లిది ఓ ప్రత్యేకశైలి. తనదైన శైలిలో సునిశితహాస్యతో రాళ్లపల్లి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. కొన్ని వందల తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రాళ్లపల్లి మే 17న కన్నుమూశారు.

గిరీష్ కర్నాడ్: ప్రముఖ కన్నడ నాటక రచయిత, నటుడు, దర్శకుడు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మశ్రీ పద్మ భూషణ్ గిరీష్ కర్నాడ్ ఈ ఏడాది మరణించారు. జూన్ 10న తుదిశ్వాస విడిచిన ఆయన కన్నడలో పలు నాటకాలు రచించి వెలుగులోకి వచ్చారు. 1970లో ‘సంస్కారా’ అనే చిత్రం ద్వారా ఆయన సినిమాల్లో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం సినిమాల్లో ఆయన నటించారు.

విజయ నిర్మల: అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల ఈ ఏడాది జూన్ 27న హఠాన్మరణం చెందారు. . అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నీస్‌బుక్ రికార్డుల్లో స్థానం సాధించిన విజయనిర్మల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.

దేవదాస్ కనకాల: ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల ఈ సంవత్సరం ఆగష్టు 2న కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న దేవదాస్ కనకాల కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దేవదాస్ నాటకరంగంలో, సినీ ఇండస్ట్రీలో ప్రముఖ పాత్ర పోషించారు. నటుడిగాను, దర్శకుడిగాను రాణించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ స్థాపించి ఎంతోమంది ప్రముఖ నటులకు, స్టార్‌ హీరోలకు నటనలో ఓనమాలు దిద్దించారు.

వేణు మాధవ్: ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్‌ సెప్టెంబర్ 25న తుది శ్వాస విడిచారు.  తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న వేణు మాధవ్‌ కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతూ హాస్పటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందారు. 1997 సంవత్సరంలో సంప్రదాయం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయిన ఆయనకు ‘తొలిప్రేమ’ చిత్రంతో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ‘లక్ష్మి’ చిత్రంలో నటించిన పాత్రకు వేణు మాధవ్‌కు నంది అవార్డు వరించింది.

గీతాంజలి రామకృష్ణ: తెలుగు సినిమా సీనియర్ నటి గీతాంజలి రామకృష్ణ హార్ట్ ఎటాక్‌తో అక్టోబర్ 21న మరణించారు. ఆమె నాటి ప్రముఖ నటుడు , హీరో రామకృష్ణ భార్య. ఆమె సుమారు 400 సినిమాలలో నటించారు. హీరోయిన్ గా, కామెడీ ఆర్టిస్టుగా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు, కన్నడ, తమిళం, హిందీ చిత్రాలలో నటించారు. ఆమె తొలిచిత్రం రాణి రత్న ప్రభ.

గొల్లపూడి మారుతీరావు: సినీ రచయిత, నవలాకారుడు, కథకుడు గొల్లపూడి మారుతీరావు మృతి నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గొల్లపూడి మారుతీరావు డిసెంబర్ 12న తుదిశ్వాస విడిచారు. 290కి పైగా చిత్రాల‌లో న‌టించిన గొల్ల‌పూడి ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య చిత్రంతో న‌టుడిగా సినీ రంగ ప్ర‌వేశం చేశారు.ఆయన మరణం సినిమా పరిశ్రమకే కాక తెలుగు సాహిత్యానికి తీరనిలోటును మిగిల్చింది.

loader