కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న లవ్ స్టోరీ 96 సినిమా తెలుగులో రీమేక్ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే నేడు సినిమాకు సంబందించిన స్పెషల్ అప్డేత్ తో చిత్ర యూనిట్ వస్తున్నా రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్  ని రిలీజ్ చేశారు. సినిమా టైటిల్ పై అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్న తరుణంలో సినిమా అసలైన టైటిల్ జాను అని క్లారిటీ ఇచ్చారు.

ఫస్ట్ లుక్ లో శర్వా ఎడారిలో కెమెరా పట్టుకొని ఓ బాటసారి లా కనిపిస్తునాడు. సమంతా హీరోయిన్ గా  నటిస్తున్న ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. కోలీవుడ్ 96 కథలో త్రిషా విజయ్ సేతుపతి నటించిన సంగతి తెలిసిందే.  ఇక తెలుగులో దర్శకుడి కోరిక మేరకు శర్వానంద్ - సమంతను దిల్ రాజు ఫిక్స్ చేశాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయ్యింది.

దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎండింగ్ కి వచ్చేశాయి. ఈ లవ్ స్టోరీ తెలుగు ఆడియెన్స్ కి కూడా నచ్చుతుందని నిర్మాత దిల్ రాజు పట్టుబట్టి కథను రీమేక్ చేస్తున్నాడు. ఒరిజినల్ కథకు రీమేక్ కు ఏ మాత్రం తేడా రావద్దని  ఒరిజినల్ తమిళ్ దర్శకుడైన సి.ప్రేమ్ కుమార్ ని ఎంచుకున్నాడు. మరి సినిమా దిల్ రాజు ఆశించిన స్థాయిలో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

‘అల... వైకుంఠపురములో..’ ఫిల్మ్ నగర్ టాక్!