Asianet News TeluguAsianet News Telugu

‘అల... వైకుంఠపురములో..’ ఫిల్మ్ నగర్ టాక్!

అందుతున్న సమాచారం బట్టి ‘అల... వైకుంఠపురములో..’  ఫుల్ క్లాస్ మూవీ. ముఖ్యంగా మల్టిప్లెక్స్ ప్రేక్షకులకు బాగా పడుతుంది. బి,సి సెంటర్లు ఆశించే మసాలా పెద్దగా లేకపోవటంతో అక్కడ ఏ స్దాయిలో వర్కవుట్ అవుతుందో చూడాలి అంటున్నారు.

Allu Arjun's Ala vaikunthapurramloo film nagar talk
Author
Hyderabad, First Published Jan 7, 2020, 9:47 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం 2020, జనవరి 12న విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  ఈ చిత్రం సెన్సార్ సైతం పూర్తైంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఫిల్మ్ నగర్ టాక్ బయిటకు వచ్చింది.

అందుతున్న సమాచారం బట్టి ‘అల... వైకుంఠపురములో..’  ఫుల్ క్లాస్ మూవీ. ముఖ్యంగా మల్టిప్లెక్స్ ప్రేక్షకులకు బాగా పడుతుంది. బి,సి సెంటర్లు ఆశించే మసాలా పెద్దగా లేకపోవటంతో అక్కడ ఏ స్దాయిలో వర్కవుట్ అవుతుందో చూడాలి అంటున్నారు. అలాగే సెకండాఫ్ పూర్తిగా తండ్రి,కొడుకు సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంది. అది కనక ఫ్యామిలీలకు పడితే కనక..ఇక ఈ సినిమా 2020 బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఒకటి అవుతుంది.

చాలా మంది మా నాన్న డబ్బులు కొట్టేశారని అంటారు.. స్టేజ్ పై ఏడ్చేసిన అల్లు అర్జున్!

సినిమా చూసిన వాళ్లు సినిమా బాగోలేదు అనలేదు..అంతలా హృదయానికి పట్టే సీన్స్ ఉన్నాయి. అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఈ సినిమాతో హాట్రిక్ కొట్టే అవకాసం ఉంది. ఇక ఏ స్దాయి సక్సెస్ అనేది బి,సి సెంటర్లలలో ఎలా రిసీవ్ చేసుకుంటారనేదానిపై ఆధారపడుతుంది.  అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉంది అనేది...రిలీజ్ అయ్యాక మాత్రమే ఖరారు చేసుకోగలం.

అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు. డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్ – లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్ నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు).

Follow Us:
Download App:
  • android
  • ios