స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురములో చిత్రం టాలీవుడ్ రికార్డులని కొల్లగొడుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలయింది. తొలి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న అల వైకుంఠపురములో చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. 

ఈ చిత్రంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించారు. టబు, మలయాళీ క్రేజీ హీరో జయరాం కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి తమన్ సెన్సేషనల్ మ్యూజిక్ అందించాడు. సామజవరగమన, రాములో రాములా, బుట్టబొమ్మ లాంటి పాటలు ఉర్రూతలూగిస్తున్నాయి. 

సెలెబ్రిటీలు సైతం అల వైకుంఠపురములో చిత్ర పాటలకు ఫిదా అవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ చిత్ర సాంగ్స్ పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా మలయాళీ క్రేజీ హీరోయిన్ మంజు వారియర్ ఈ చిత్రంలోని బుట్ట బొమ్మ సాంగ్ కు తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. 

బుట్టబొమ్మ సాంగ్ కు మంజు వారియర్ లయబద్దంగా తల ఊపుతూ.. డాన్స్ చేస్తూ కనిపిస్తున్న వీడియో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోపై మీరూ లుక్కేయండి. మళయాలంలో కూడా బన్నీకి విశేషమైన అభిమానులు ఉన్నారు. ఆ స్థాయిలో మలయాళంలో ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో బన్నీ. 

'లోఫర్' బ్యూటీ బికినీ షో.. పిచ్చెక్కించేలా ఫోజులు!