తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా, నటుడిగా ఓ విలక్షణ పంథాలో కొనసాగుతున్నారు తణికెళ్ల భరణి. శివ సాంగత్యంలో తన్మయత్వం పొందే ఆయనకు దర్శకత్వం అంటే మక్కవ. దాంతో ఇప్పటికే చాలా షార్ట్ ఫిల్మ్ లు చేసారు. ఫిల్మ్ ఫెస్టివల్స్ అవార్డ్ లు సాథించారు. అలాగే ఆ మధ్యన మిధునం చిత్రంతో దర్శకుడుగా మారారు. అయితే ఆ తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. ఆయన రాసిన నాటకం ఒకటి సినిమా చేస్తున్నారని ఆ మధ్యన వినపడింది కానీ ...దాని పూర్తి వివరాలు బయిటకు రాలేదు.

అయితే తను నమ్మిన విధంగా స్క్రిప్టు వచ్చే దాకా కష్టపడే ఆయన... పూర్తి సంతృప్తి చెందాకే తెరకెక్కిస్తానంటారు. అలా తాజాగా ఆయన ఓ స్క్రిప్టుని ఓకే చేసి తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. షావుకారు జానకి ప్రధాన పాత్రలో 'అమ్మ బ్రతికే ఉంది' టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం.

పెళ్లి అందుకే సీక్రెట్ గా, నా భర్త వల్లే ఇప్పటికీ .. హీరోయిన్ శ్రీయ!

చాలా లో బడ్జెట్ లో ఈ సినిమా తియ్యబోతున్నారు. తల్లి సెంటిమెంట్ తో సాగే ఈ చిత్రంలో అనేక మంది కొత్త వారు నటించబోతున్నారు. భరణి స్వయంగా ఈ సినిమాలో కీ పాత్రలో కనిపించబోతున్నారు. అంతేకాదు ఈ ప్రయోగాత్మక చిత్రం వేరే వారి డబ్బుతో ఎందుకని స్వయంగా తనే నిర్మిస్తున్నట్లు సమాచారం.

మిధునం వంటి విజయవంతమైన చిత్రం తర్వాత తణికెళ్ల భరణి దర్శకత్వంలో చిత్రం గురించి అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ నిన్న మొన్నటి వరకూ ఏదీ మెటీరయలైజ్ కాలేదు. ఆ మధ్యన శర్వానంద్ తో అనుకున్న ఊరి చివరి గుడెసె ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. ఆ తర్వాత ఆయన సునీల్ తో భక్త కన్నప్ప అనుకున్నారు. కానీ రకరకాల చర్చలు, లెక్కలతో ఆ ప్రాజెక్టూ మెటీరియలైజ్ కాలేదు. దాంతో ఈ సినిమా అయినా ఆయన మళ్లీ దర్శకుడుగా నిలదొక్కుకుంటారని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.