దర్శకధీరుడు రాజమౌళి ప్రమోషన్స్ విషయంలో ఎంత తెలివిగా ఆలోచిస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే మొదటిసారి RRR సినిమాకు సంబందించిన బిగ్గెస్ట్ రూమర్ హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాలో ఇండియన్ సూపర్ స్టార్స్ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. లతో దర్శకుడు రాజమౌళి ఇటీవల చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.  అందరూ అనుకున్నట్టుగా వారు సినిమాలో నటిస్తున్నారు అనుకుంటే పొరబడినట్లే.. ఎందుకంటె వారు సినిమాలో నటించడం లేదు. కేవలం వాయిస్ ఓవర్ మాత్రమే అందిస్తారట. తెలుగులో మహేష్ హిందీలో అమితాబ్ బచ్చన్.. వారి వాయిస్ తో సినిమాకు పవర్ఫుల్ ఎమోషన్ ని యాడ్ చేస్తారని సమాచారం.

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరీ ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే. 400కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. అజయ్ దేవ్ గన్ కి సంబందించిన ఎపిసోడ్స్ వర్క్ ని ఇటీవల స్టార్ట్ చేశారు. ఈ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్ రిలీజ్ అనంతరం ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.