Asianet News TeluguAsianet News Telugu

రాజకీయ నాయకులు పూజలు చేస్తారు కానీ.. పలాసపై తమ్మారెడ్డి కామెంట్స్!

ఈ శుక్రవారం దాదాపు అరడజను చిత్రాలు బాక్సాఫీస్ వద్దకు రాబోతున్నాయి. అన్ని చిన్న చిత్రాలే. వాటిలో పలాస 1978, ఓ పిట్టకథ లాంటి చిత్రాలు ఆసక్తి రేపుతున్నాయి.

Tammareddy Bharadwaj reveals interesting details about Palasa 1978
Author
Hyderabad, First Published Mar 5, 2020, 8:27 PM IST

ఈ శుక్రవారం దాదాపు అరడజను చిత్రాలు బాక్సాఫీస్ వద్దకు రాబోతున్నాయి. అన్ని చిన్న చిత్రాలే. వాటిలో పలాస 1978, ఓ పిట్టకథ లాంటి చిత్రాలు ఆసక్తి రేపుతున్నాయి. పలాస 1978 చిత్రం పలాస ప్రాంతంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా దర్శకుడు కరణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

1978 నుంచి ఇప్పటి వరకు పలాస ప్రాంతంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయి, అప్పటి సమాజం ఎలా ఉంది అనే అంశాలని దర్శకుడు కళ్ళకు కట్టినట్లు చూపించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి సమర్పిస్తున్నారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చిత్ర విశేషాలు తెలియజేశారు. 

అందాలతో హీట్ పెంచుతోంది.. అనసూయ లేటెస్ట్ ఫోటోస్

అల్లు అరవింద్, మారుతీ, బన్నీ వాసు లాంటి ప్రముఖులంతా ఈ చిత్రాన్ని ప్రశంసించారు. సురేష్ బాబు ఈ చిత్రాన్ని మెచ్చి స్వయంగా రిలీజ్ చేస్తున్నారు అని తమ్మారెడ్డి రెడ్డి అన్నారు. ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. రాజకీయ నాయకులు గాంధీజీ ఫోటో పెట్టి పూజలు చేస్తారు. కానీ ఆయన ఆశయాలని మాత్రం పాటించరు. అలాగే సమాజంలో ధనిక, పేద తారతమ్యాలు ఇంకా అలాగే ఉన్నాయి. ఇలాంటి అంశాలన్నీ ఈ చిత్రంలో ఉండబోతున్నాయి అని తమ్మారెడ్డి అన్నారు. 

పవన్, త్రివిక్రమ్, అల్లు అరవింద్.. జల్సా కాంబినేషన్ రిపీట్ ?

ఈ చిత్రంలో అశ్లీలత ఎక్కడా ఉండదని అన్నారు. రక్షిత్, నక్షత్ర ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించారు. రఘు కుంచె ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన పలాస 1978 చిత్రం శుక్రవారం విడుదల కానుంది. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios