పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన ఎన్నడూ లేని విధంగా ప్రకటనలు వస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ ఏడాదికి ఒక సినిమా చేయడం కూడా కష్టంగా ఉండేది. అలాంటిది ప్రస్తుతం ఒకేసారి రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. మరో చిత్రానికి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. 

తాజాగా మరికొన్ని చిత్రాలకు సంబంధించిన ఆసక్తికర వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా పవన్ అభిమానులు పండగ చేసుకునే ఆసక్తికర వార్త చిత్ర వర్గాల నుంచి వినిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లు నాలుగో చిత్రానికి రెడీ అవుతున్నారట. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అంటే దాదాపు 12 ఏళ్ల తర్వాత జల్సా కాంబినేషన్ రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2021 దసరాకు ప్రారంభించబోతున్నట్లు సమాచారం. పవన్, త్రివిక్రమ్ కాబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక అజ్ఞాతవాసి చిత్రం తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. 

రామ్ చరణ్ నా కోసం వస్తున్నాడు.. మంచు మనోజ్ ఎమోషనల్ కామెంట్స్

మరోవైపు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పవన్ తో 'జనగణమన' అనే క్రేజీ మూవీ తెరకెక్కించబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పవన్ నటించే ఈ రెండు చిత్రాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా పవన్ ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం మే లో రిలీజ్ కానుంది. అదే విధంగా క్రిష్ దర్శత్వంలో ఓ పీరియాడిక్ చిత్రంలో కూడా పవన్ నటిస్తున్నాడు.