ప్రముఖ తమిళ నటుడు తెన్నవన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం తెల్లవారు జామున ఆయనకు పక్షవాతం రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన చెన్నైలోని ఓ ప్రయివేట్‌ హాస్పిటల్ కి తరలించారు. ఆయనకి వచ్చిన పక్షవాతం ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. తెన్నవన్‌ ను దర్శకుడు భారతీరాజా కోలీవుడ్‌ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు వారికి సుపరిచితమే.. చియాన్‌ విక్రమ్‌ సినిమా ‘జెమిని’తో తెన్నవన్‌కు సహాయనటుడిగా మంచి గుర్తింపు లభించింది.

గల్లా అశోక్ మూవీ.. కోటికి తగ్గనంటున్న ఇస్మార్ట్ బ్యూటీ

ఆ తరువాత ఇండస్ట్రీలో వరుస అవకాశాలు లభించాయి. కమల్‌ హాసన్‌ విరుమండి, జిగర్తాండా, సుందర పాండియన్, సండకోళి వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా రజనీ కాంత్‌ ‘పెట్టా’సినిమాలో మినిస్టర్‌ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. 

సహాయ నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించిన తెన్నవన్‌ ఆరోగ్య పరిస్థితిబాగాలేదని తెలుసుకున్న కోలీవుడ్‌ వర్గాలు ఆస్పత్రికి చేరుకుని.. ఆయన కుతుమసభ్యులకు ధైర్యం చెబుతున్నారు.