సవ్యసాచి సినిమాతో  తెలుగు తెరకు పరిచయమైన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. బేబీ నటించిన మొదటి రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలిచినప్పటికీ ఇస్మార్ట్ శంకర్ తో సాలిడ్ సక్సెస్ అందుకుంది. రామ్ - పూరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఆ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మొత్తానికి మొదటి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు కూడా స్టార్ హీరోలతో అయితే అవకాశాలు అందుకోవడం లేదు.  

చిన్న తరహా అవకాశాలు గట్టిగానే వస్తున్నప్పటికీ ఆచి తూచి సెలెక్ట్ చేసుకుంటోంది. సినిమాలో గ్లామర్ షోతో పాటు తాను చేసి పాత్రకు కూడా ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఉండాలని కండిషన్స్ పెడుతోందట. ఇక రీసెంట్ గా బేబీ మహేష్ మేనల్లుడి సినిమాలో నటించడానికి ఒప్పుకున్నా విషయం తెలిసిందే. గల్లా జయదేవ్ తనయుడుఅశోక్ నటించనున్న మొదటి సినిమా రేపే మొదలుకానుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకున్న నిధి సాలిడ్ రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలో నటించడానికి అమ్మడు కోటికిపైగా డిమాండ్ చేయడంతో నిర్మాతలు ఒక కోటితో రౌండ్ ఫిగర్ ఎమౌండ్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్ తో అమ్మడు తన క్రేజ్ పెంచుకోవడంతో ప్రస్తుతం కుర్ర హీరోలు బేబీ వైపే చూస్తున్నారు.

మరి ఈ క్రేజ్ తో ఎలాంటి సక్సెస్ లు అందుకుంటుందో చూడాలి.  ఇక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అశోక్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతోందట. నిధి అగర్వాల్ ఈ హీరోకి పర్ఫెక్ట్ జోడి అని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 రామానాయుడు స్టూడియోలో న‌వంబ‌ర్ 10న  ఈ సినిమా ప్రారంభోత్స‌వ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించనున్నారు. సినీ ప్ర‌ముఖులు అలాగే పలువురు రాజకీయనాయకులు హాజ‌రవుతున్నారు. త‌న‌దైన స్టైల్లో డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య డిఫ‌రెంట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండ‌గా రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.