Asianet News TeluguAsianet News Telugu

ఆ సినిమా చూశాక.. నా మీద నాకే సిగ్గేసింది.. దర్శకుడి కామెంట్స్!

గురువారం నాడు చెన్నైలో 'బారమ్' అనే సినిమాకి సంబంధించిన ఈవెంట్ ని నిర్వహించారు. ఈ వేడుకకు మిస్కిన్ గెస్ట్ గా వెళ్లారు. ఈ క్రమంలో సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడారు.

tamil director mysskin says he is ashamed of his own films
Author
Hyderabad, First Published Feb 14, 2020, 12:52 PM IST

తమిళంలో ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు మిస్కిన్ ఇటీవల 'సైకో' అనే సినిమాని రూపొందించాడు. ఈ సినిమాకి కూడా మంచి హిట్ టాక్ వచ్చింది. అయితే తనకు మాత్రం తను రూపొందించే సినిమాలు చూస్తే సిగ్గేస్తుందని అంటున్నారు మిస్కిన్.

గురువారం నాడు చెన్నైలో 'బారమ్' అనే సినిమాకి సంబంధించిన ఈవెంట్ ని నిర్వహించారు. ఈ వేడుకకు మిస్కిన్ గెస్ట్ గా వెళ్లారు. ఈ క్రమంలో సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడారు. సినిమా చూసిన తరువాత తనను ఎవరో చెప్పుతో కొట్టినట్లు అనిపించిందని.. ఈ సినిమా చూసిన తరువాత తను తీసిన సినిమాలపై తనకే సిగ్గుగా ఉందని అన్నారు.

వెండితెరపై లేత ప్రేమకథ.. బొమ్మ హిట్ కొట్టిందంతే..!

తను బారమ్ లాంటి సినిమాలు తీయలేకపోయానని ఫీల్ అవుతున్నానని చెప్పారు. ప్రతీ ఒక్కరూ బారమ్ సినిమాను తమ తల్లితండ్రులతో కలిసి చూడాలని కోరుకుంటున్నానని చెప్పారు. సినిమా చూసిన తరువాత తల్లితండ్రులపై ప్రేమ మరింత పెరుగుతుందని అన్నారు.

ఈ సినిమా తనకు ఎంతగానో నచ్చిందని.. సినిమా చూసిన తరువాత తనొక నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. సినిమా పోస్టర్లను తనే స్వయంగా వెళ్లి గోడలపై అతికించి ప్రమోట్ చేస్తానని చెప్పారు.

దర్శకుడు కృష్ణస్వామి తెరకెక్కించిన 'బారమ్' గతేడాది విడుదలైంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా లభించింది. రీసెంట్ గా జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో అవార్డు అందుకున్న ఏకైక తమిళ సినిమా ఇదే కావడం విశేషం. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ఈ సినిమాని ప్రదర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios