మిల్కీ బ్యూటీ తమన్నా అభిమానులకు కలల రాణి. తమన్నా దాదాపు దశాబ్ద కాలంగా తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తమన్నా మిల్కీ అందాలకు ఫిదా కానీ యువత లేరు. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే తమన్నా స్పెషల్ సాంగ్స్ లో కూడా మెరుపులు మెరిపిస్తోంది. 

సినిమాకు అవసరమైన మేరకు అందాలు ఆరబోసేందుకు తమన్నా వెనుకాడదు. చాలా చిత్రాల్లో తమన్నా అందం, అభినయం హైలైట్ గా నిలిచింది. ఎంత గ్లామర్ షో చేసినప్పటికీ తమన్నా తన కంటూ కొన్ని నిబంధనలు పెట్టుకుంది. లిప్ లాక్ సన్నివేశాల్లో, బికినీ ధరించిన సన్నివేశాల్లో నటించనని ఇప్పటికే తమన్నా తేల్చి చెప్పింది. 

కాగా తమన్నాపై సోషల్ మీడియాలో ఇటీవల ట్రోలింగ్ జరిగింది. విశాల్ హీరోగా నటించిన యాక్షన్ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో తమన్నా గ్లామర్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా అదరగొట్టింది. ఇక ఓ సాంగ్ లో బికినీ లాంటి అవుట్ ఫిట్ లో మెరిసింది. 

జబర్దస్త్ లో రోజా మార్క్ పాలిటిక్స్.. నాగబాబు ప్లేస్ ఆయనదే ?

బికినిలో నటించనని చెప్పిన తమన్నా మాట తప్పింది అంటూ అభిమానులు ఆమెని ట్రోల్ చేశారు. మంచి పారితోషికం లభించడంతో తన నిబంధనని సైతం పక్కన పెట్టేసింది అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్ పై తమన్నా ఇటీవల స్పందించింది. ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. 

పాయల్ రాజ్ పుత్ అందాల హొయలు.. వైరల్ అవుతున్న ఫొటోస్!

సినిమాలో కథకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి. అప్పుడు నటులు కాగలం. నేను ఇది చేయను అని కూర్చుకుంటే కథకు న్యాయం జరగదు. ఆ సన్నివేశంలో ఎలాంటి కాస్ట్యూమ్స్ అవసరమో వాటినే ధరించాలి. అయినా నేను బికినీ ధరించాననే చర్చ ఆపండి అంటూ కోపంగా స్పందించింది. యాక్షన్ మూవీలో తాను బికినీలోనే కనిపించలేదు అని తేల్చి చెప్పింది. అది కేవలం బికినీలా అనిపించే డిఫెరెంట్ అవుట్ ఫిట్ అని తెలిపింది.