టాలీవుడ్ లో ప్రస్తుతం కుర్ర హీరోయిన్స్ కి గట్టిపోటీని ఇస్తున్న నటీమణుల్లో తమన్నా ఒకరు. రష్మిక మందన్నా - పూజా హెగ్డే వంటి భామలు స్టార్ హీరోలతో అవకాశాలను అందుకుంటూ సీనియర్ భామబాలకు ఛాన్సులు దక్కకుండా డామినేట్ చేస్తున్నారు. కానీ తమన్నా మాత్రం వారికి దీటుగా అందాల ఆరబోతతో పోటీ ఇస్తోంది.

 గ్లామర్ విషయంలో దర్శక నిర్మాతలకు ముందే షరతులు విదిస్తానని చెప్పిన తమన్నా ఇప్పుడు మాత్రం మాట మార్చేసినట్లు అర్ధమవుతోంది. విశాల్ యాక్షన్ సినిమాలో బేబీ ఏ రేంజ్ లో డోస్ పెంచిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అదే విధంగా లిప్ లాక్ లపై ఇటీవల తమన్నా ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. 14 ఏళ్ల కెరీర్ లో తమన్నా ఇంతవరకు లిప్ లాక్ సన్నివేశాల్లో నటించలేదు.

read also: టబు హాట్ పిక్స్.. @48లో కూడా తగ్గని అందాల ఘాటు

ప్రస్తుతం టాలీవుడ్ కమర్షియల్ చిత్రాల్లో లిప్ లాక్ సన్నివేశం కామన్ అయిపోయింది. స్టార్ హీరోయిన్లు సైతం ముద్దు సన్నివేశాల్లో నటిస్తున్నారు. కానీ తాను మాత్రం లిప్ లాక్ సీన్స్ లో నటించే ప్రసక్తే లేదు అని తమన్నా మరోమారు తేల్చి చెప్పేసింది.  అలా చెప్పిన రెండురోజులకే మరో కామెంట్ తో షాకిచ్చింది. ఒక్క హీరోతో మాత్రం లిప్ లాక్ కి షరతులు విదించనని తెగసి చెప్పింది.

అతనెవరో కాదు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. హృతిక్ తో నటించే అవకాశం వస్తే లిప్ లాక్ సీన్ చేయడానికి ఏ మాత్రం అలోచించనని వెంటనే ఒప్పేసుకుంటానని చెప్పేసింది. అందుకు కారణం తాను ఎప్పటినుంచో హృతిక్ కి అభిమానురాలినని వివరించింది.

తనకు ఇష్టమైన హీరోతో లిప్ లాక్ సీన్ చేయడానికి ఏ మాత్రం అడ్డు చెప్పానని చెప్పిన తమన్నా కోరిక ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి. గతంలో బేబీ హిమ్మత్ వాలా అనే బాలీవుడ్ సినిమా చేసినప్పటికీ నార్త్ జనాలు మిల్కి బ్యూటీని పెద్దగా పట్టించుకోలేదు. అయినప్పటికీ తన ప్రయత్నాలు మానకుండా కష్టపడుతోంది. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ తో ఒక సినిమా చేస్తోంది.