మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ లో స్టార్ హీరోయిన్. బడా హీరోలందరితో తమన్నా నటించింది. మరే హీరోయిన్ కి సాధ్యం కాని విధంగా తమన్నా గ్లామర్ మెరుపులు యువతని ఆకర్షిస్తాయి. పలు చిత్రాల్లో తమన్నా అందాలు యువతని ఆకట్టుకున్నాయి. 

ఇటీవల తమన్నా జోరు కాస్త తగ్గింది. అయినప్పటికీ తమన్నా స్పెషల్ సాంగ్స్, కీలకమైన పాత్రల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం సెలెబ్రిటీలంతా లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. తమన్నా కూడా ఇంట్లోనే ఉంటూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. 

తమన్నా తన బాలీవుడ్ అనుభవం గురించి ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సౌత్ లో రాణించే ప్రతి హీరోయిన్ బాలీవుడ్ లో కూడా రాణించాలని కళలు కంటారు. కానీ అది అందరికి సాధ్యం కాదు. తమన్నా కూడా బాలీవుడ్ లో స్టార్ హీరో అజయ్ దేవగన్ సరసన హిమ్మత్ వాలా అనే చిత్రంలో నటించింది. 

నిజమే.. సెక్స్ కోసం నన్ను చాలామంది అడిగారు.. 43 ఏళ్ల హీరోయిన్ బోల్డ్ కామెంట్స్

ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్. ఈ చిత్రం గురించి తమన్నా మాట్లాడుతూ.. హిమ్మత్ వాలా చిత్రం తన కెరీర్ కు పెద్ద దెబ్బ అని తెలిపింది. కానీ ఆ చిత్రం విడుదల సమయంలో తాను నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నాని తెలిపింది. 

అందువల్ల ఆ చిత్ర పరాజయం గురించి ఎక్కువగా ఆలోచించలేదు. హిమ్మత్ వాలా చిత్రం ఒకరకంగా నా కెరీర్ కు మంచే చేసింది. ఆ చిత్రం పరాజయం నాకో గుణపాఠం. కథలు ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆ చిత్రం తర్వాతే నేర్చుకున్నా అని తమన్నా చెప్పుకొచ్చింది.