సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో తను నటించిన కొన్ని సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ లో నటించాడు. 'నాని' సినిమాలో అమీషా పటేల్ తో లిప్ లాక్ సీన్ లో నటించాడు మహేష్. అలానే 'బిజినెస్ మెన్'లో కాజల్ అగర్వాల్ తో, 'దూకుడు'లో సమంతతో, అలానే కృతిసనన్ తో లిప్ లాక్ సీన్స్ లో నటించాడు మహేష్ బాబు.

కానీ వాటిని ఘాడమైన ముద్దు సీన్లని చెప్పడానికి వీలులేదు. మహేష్ అలాంటి సన్నివేశాల్లో నటించడంతో అవి బాగా హైలైట్ అయ్యాయి. ఇప్పుడు మన సూపర్ స్టార్ మరో లిప్ లాక్ సీన్ లో నటించినట్లు సమాచారం. మహేష్ బాబు హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ బుల్లితెర స్టార్లు ఎంత సంపాదిస్తారో తెలుసా..?

ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. కథ ప్రకారం సినిమాలో వీరిద్దరి మధ్య లిప్ లాక్ సీన్ ఉన్నట్లు సమాచారం. గతంలో రష్మిక 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి చిత్రాల్లో లిప్ లాక్ సీన్స్ లో నటించింది. ఇప్పుడు మహేష్ తో బోల్డ్ సీన్ కి సిద్ధమైపోయింది.

పొల్లాచిలో జరిగిన సినిమా షూటింగ్ లో వీరిద్దరి మధ్య లిప్ లాక్ సీన్స్ ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకి లీక్ అవ్వడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మహేష్ తో రష్మిక లిప్ లాక్ అంటే సినిమాలో అదొక హైలైట్ సీన్ గా నిలవడం ఖాయం. మరి ఆ సన్నివేశాలు వెండితెరపై చూడాలంటే వచ్చే ఏడాది జనవరి 12 వరకు ఎదురుచూడక తప్పదు.