‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత సినిమాలు చేయనని చెప్పిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఇప్పుడు వరుసగా చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘పింక్ రీమేక్’ చిత్రం ‘పవన్26’ షూటింగ్‌లో ఆయన జాయిన్ అయినయ్యారు. ఇప్పుడు పవన్27 చిత్రం కూడా మొదలైపోయింది. ఈ చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ చిత్రాన్ని ‘ఖుషి’ నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మించనున్నారు. ఈ చిత్రం జనవరి 29వ తేదీన ఎటువంటి హంగామా లేకుండా పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన టీమ్.., మార్చి నుంచి రెగ్యులర్ షూట్ జరపటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన విశేషాలు బయిటకు వస్తున్నాయి.

త్రివిక్రమ్ వాస్తు దోషం పవన్ ని ముంచిందా ?

ఈ పీరియాడిక‌ల్ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నార‌ు. ఔట్‌డోర్స్ పెద్దగా లేకుండా సినిమాలో ఎక్కువ భాగం హైద‌రాబాద్‌లోనే షూట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. అందుకోసం భారీ సెట్స్‌ను హైద‌రాబాద్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో సిద్ధం చేస్తున్నారని సమాచారం.

అందులో భాగంగా తాజ్‌మ‌హల్‌, ఛార్మినార్ సెట్స్‌ను భారీ ఖ‌ర్చుతో సిద్ధం చేశార‌ట‌. గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ నటించిన తొలి ప్రేమ‌, బాలు సినిమాల కోసం తాజ్ మ‌హల్ సెట్‌ను వేశారు. తాజాగా మ‌రోసారి ప‌వ‌న్ కోసం తాజ్‌మ‌హ‌ల్ సెట్‌ను వేయ‌డంతో ప్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. తమ హీరోకు తాజ‌మ‌హల్ సెట్ ప‌వ‌న్‌కు బాగానే క‌లిసొచ్చిందని ఈ సారి మెగా హిట్ ఖాయమని అంటున్నారు.  

ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 4 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌నుంద‌ట‌. ఈ షెడ్యూల్‌లో ప‌వ‌న్ పాల్గొన‌డం లేద‌ట‌. మిగతా ఆర్టిస్ట్ లతో క్రిష్ షూట్ ముందుకు తీసుకెళ్తారట. ఇప్పటికే మొదలెట్టిన పింక్ సినిమాలో పవ‌న్ త‌న పార్ట్‌ను పూర్తి చేసుకున్న త‌ర్వాత ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌ిస్తున్నాయి. ఎ.ఎం.ర‌త్నం ఈ చిత్రాన్ని భారీగానే నిర్మిస్తున్నారు.