బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ల గారాల తనయుడు తైమూర్.. ఇప్పటికే సెలబ్రిటీ అయిపోయాడు. తైమూర్  ఎక్కడకి వెళ్లినా.. ఫోటోగ్రాఫర్లు వెంటపడి మరీ ఫోటోలు తీస్తుంటారు. అయితే కరీనా దంపతులకు మాత్రం ఈ విషయం పెద్దగా నచ్చదు.

తైమూర్ కూడా అందరి పిల్లల్లానే స్వేచ్చగా ఉండాలని.. తనను ఫోటోలు తీయోద్దని కరీనా సందర్భం వచ్చిన ప్రతీసారి చెబుతూనే ఉంటుంది. తైమూర్ ని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు కుటుంబసభ్యులు. అతడికి సంబంధించిన ఏ విషయంలో కూడా ఈ స్టార్ కపుల్ రాజీ పడడం లేదు. తైమూర్ ని తల్లిలా చూసుకునే కేర్ టేకర్ ని పెట్టుకొని ఆమెకి లక్షల్లో జీతాలు ఇస్తున్నారు.

రష్మిక ఇంటిపై ఐటీ రైడ్స్.. నిజం కాదంటున్న మేనేజర్!

ఇది ఇలా ఉండగా.. తైమూర్ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని చాలా కంపనీలు ప్రయత్నిస్తున్నాయి. చిన్న పిల్లలకు చెందిన ప్రొడక్ట్స్ విషయంలో తైమూర్ ని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ డైపర్ కంపనీ వారు చాలా రోజులుగా తైమూర్ ని తమ యాడ్ లో నటింపజేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే సైఫ్, కరీనాలను సంప్రదించారు. మొదట్లో ఈ స్టార్ కపుల్ ఈ ఆఫర్ ని కాదనుకున్నారు. కానీ వారు పదే పదే అడుగుతుండంతో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కేవలం మూడు గంటల పాటు తైమూర్ ని షూట్ లో పాల్గోనిస్తే చాలని చెప్పడంతో కరీనా, సైఫ్ లు అంగీకరించారు.

ఈ మూడు గంటల కోసం తైమూర్ కి దాదాపు కోటిన్నర రూపాయలు రెమ్యునరేషన్ గా ఇస్తున్నట్లు సమాచారం. అప్పుడే ఈ ఛోటా న‌వాబ్ కి మార్కెట్ మొదలైపోయింది!