స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.  హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అల వైకుంఠపురములో చిత్ర మ్యూజిక్ కన్సర్ట్ లో సీనియర్ నటి టబు మెరిశారు. 

ఆమె మాట్లాడుతూ.. 10 ఏళ్ల తర్వాత తాను నటిస్తున్న తెలుగు చిత్రం ఇదే అని అన్నారు. తన రీఎంట్రీకి ఇంతకంటే మంచి చిత్రం దొరకదని అన్నారు. ఏ ఈవెంట్ లో టబుకి తెలుగు ఉన్న క్రేజ్ స్పష్టంగా కనిపించింది. ఆమె మాట్లాడుతుంటే అభిమానులు కేరింతలు కొట్టారు. ఓ దశలో అభిమానుల గోలతో ఆమె మాట్లాడలేకపోయారు కూడా. 

చిత్ర యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు తెలిపి ఆమె తన ప్రసంగాన్ని త్వరగా ముగించారు. పాండురంగడు చిత్రం తర్వాత టబు నటిస్తున్న తెలుగు మూవీ ఇదే. ఈ చిత్రంలో టబు పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది. 

'పులొచ్చింది.. మేక సచ్చింది'.. 'అల వైకుంఠపురములో' ట్రైలర్ అదుర్స్!

అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది. మ్యూజికల్ కన్సర్ట్ లో తమన్ సంగీతం అందించిన పాటలకు లైవ్ పెర్ఫామెన్స్ జరుగుతోంది.