స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లోకి అల వైకుంఠపురములో మ్యూజికల్ కన్సర్ట్ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.   

ఈ ఈవెంట్ లో నిర్మాతలు అల్లు అరవింద్, రాధాకృష్ణ చేతుల మీదుగా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అయింది. ఎప్పటి లాగే ట్రైలర్ లో త్రివిక్రమ్ తన పంచ్ డైలాగ్స్, హృదయాన్ని హత్తుకునే మాటలతో కట్టిపడేసారు. అల్లు అర్జున్ స్టైలిష్ పెర్ఫామెన్స్, ఫ్యామిలీ డ్రామా ఈ చిత్రంలో హైలైట్ కాబోతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. 

'నా కొడుకు ఎక్కడున్నా రాజే' అంటూ నటి రోహిణి బ్యాగ్రౌండ్ వాయిస్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. 'మనది మిడిల్ క్లాస్.. లక్ష పనులు కోటి వర్రీస్ ఉంటాయి' అంటూ మురళి శర్మ డైలాగులతో అల్లు అర్జున్ ఈ చిత్రంలో మిడిల్ క్లాస్  కుర్రాడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 

'కొట్టేస్తున్నారు.. బ్లాక్ బస్టర్'.. 'అల వైకుంఠపురములో' రిజల్ట్ ముందే చెప్పేసిన దిల్ రాజు!

'నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది.. చెప్పకపోతే ఎప్పుడూ భయం వేస్తుంది' లాంటి త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఆసక్తిగా ఉన్నాయి. 'దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది.. ఒకటి నేలకి.. రెండు వాళ్ళకి' అంటూ మహిళల గురించి త్రివిక్రమ్ మరో గొప్ప మాట రాశారు. మలయాళీ నటుడు జయరాం, సీనియర్ హీరోయిన్ టబు పాత్రలు కూడా ఆసక్తిగా ఉన్నాయి. 

శ్రీకాకుళం సర్ ప్రైజ్ సినిమాలోనే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

ట్రైలర్ చివర్లో త్రివిక్రమ్ మాస్ డైలాగ్ తో ముగించారు. పులొచ్చింది.. మేక సచ్చింది అని అల్లు అర్జున్ పాత్ర గురించి డైలాగ్ వినిపించారు. మొత్తంగా ఈ సంక్రాంతికి త్రివిక్రమ్, అల్లు అర్జున్ స్టైలిష్ ట్రీట్ ని ప్లాన్ చేశారు. ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.