అల్లు అర్జున్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘అల...వైకుంఠపురములో...’. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. సుశాంత్, నివేతా పేతురాజ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మరో కీలక పాత్రలో  నటిస్తున్న టబు లుక్‌ను ఈ రోజు విడుదల చేశారు.

ఈ రోజు టబు పుట్టినరోజు. ఈ  లుక్ కూల్ గా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రంలో ‘సామజవరగమన...’ పాటకు మంచి స్పందన లభిస్తోంది. అలాగే ఈ సినిమాలోని ‘రాములో.. రాములా...’ పాట కూడా పెద్ద హిట్. ఈ రెండు పాటలు చాలా క్యాచీగా ఉండటంతో జనాల్లోకి వెళ్ళిపోయాయి.

పూర్ రేటింగ్స్...డిజాస్టర్ టాక్...బ్లాక్ బస్టర్ కలెక్షన్స్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. గతంలో జులాయి, S/O సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూడో సినిమా మీద మరింత ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో కూడా తండ్రి సెంటిమెంట్ ఈ చిత్రంలో హైలైట్ కానుందని తెలుస్తుంది.

తనకు మొదటినుంచి ప్లస్ గా మారిన ఎంటర్టైన్మెంట్, బలమైన ఎమోషన్స్ ఈ సినిమాలో కూడా చూపించబోతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. రీసెంట్ గా ఈ చిత్రానికి సంభందిచి  హైదరాబాద్‌లో ఓ యాక్షన్‌ సన్నివేశాన్ని తెరకెక్కించారు చిత్ర యూనిట్. ఇప్పుడు ఓ రొమాంటిక్‌ సాంగ్‌ చిత్రీకరణ కోసం యూరప్‌ వెళ్లారని తెలిసింది.

ఫ్రాన్స్‌లో అల్లు అర్జున్, పూజాహెగ్డేలపై ఈ పాటను తెరకెక్కిస్తారట. టబు, జయరామ్, సుశాంత్, నివేదా పేతురాజ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌.