Asianet News TeluguAsianet News Telugu

పూర్ రేటింగ్స్...డిజాస్టర్ టాక్...బ్లాక్ బస్టర్ కలెక్షన్స్

దర్శక,నిర్మాతలు తమ సినిమాలు తొలిరోజు టాక్ బాగుండాలని, మంచి రివ్యూలు రావాలని కోరుకుంటారు. క్రిటిక్స్ ఎవరైనా తమ సినిమాకు తక్కువ రేటింగ్స్ ఇస్తే కోపంతో రెచ్చిపోతూంటారు...  సినిమాను చంపేయకండి ..ప్లీజ్ అంటూ ప్రెస్ మీట్ లు పెడుతూంటారు. అయితే ప్రతీ సారి మీడియా, క్రిటిక్స్ అంచనా వేసినట్లే జనం రిసీవ్ చేసుకోరు. 

Housefull 4 box office day 9: Akshay Kumar film crosses Rs 150 cr mark
Author
Hyderabad, First Published Nov 4, 2019, 7:46 AM IST

రిలీజ్ రోజు హిట్ టాక్ వస్తే ఆ దర్శక,నిర్మాతలకు పండగే. చాలా వరకూ మొదటి రోజు వచ్చిన టాక్ సినిమా ఫేట్ ను డిసైడ్ చేస్తూంటుంది. అందుకే దర్శక,నిర్మాతలు తమ సినిమాలు తొలిరోజు టాక్ బాగుండాలని, మంచి రివ్యూలు రావాలని కోరుకుంటారు. క్రిటిక్స్ ఎవరైనా తమ సినిమాకు తక్కువ రేటింగ్స్ ఇస్తే కోపంతో రెచ్చిపోతూంటారు...  సినిమాను చంపేయకండి ..ప్లీజ్ అంటూ ప్రెస్ మీట్ లు పెడుతూంటారు.

అయితే ప్రతీ సారి మీడియా, క్రిటిక్స్ అంచనా వేసినట్లే జనం రిసీవ్ చేసుకోరు. అద్బుతం అంటూ ఆకాశానికి ఎత్తిన సినిమాలు సైతం కలెక్షన్స్ లేకుండూ పోతూంటాయి. పరమ చెత్త అని ఏకిపారేసిన సినిమాను ప్రేక్షకులు భుజానికెత్తుకొని సూపర్ హిట్ చేసేస్తూంటారు. హౌస్ ఫుల్ 4 చిత్రం కూడా అదే పరిస్దితి.  హౌస్ ఫుల్  సిరీస్ లో నాలుగో చిత్రం హౌజ్ ఫుల్ 4 కు మాత్రం రివ్యూలలో దారుణమైన రేటింగ్స్ ఇచ్చారు.

దాదాపు అందరూ ఇదేం సినిమా అంటూ  ఏకిపడేసారు. చాలా మంది 1 లేదా 1.5 రేటింగ్ మించి రేటింగ్స్ ఇవ్వలేదు. దానికి తగ్గట్లుగా సోషల్ మీడియాలో టాక్ కూడా నిరుత్సాహంగానే ఉంది. దాంతో నిర్మాతలు కంగారుపడ్డారు  అక్షయ్ కుమార్ కు ప్లాప్ పడిందని ఫిక్స్ అయ్యిపోయారు. అయి దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం చెత్త రివ్యూలు వచ్చినా సూపర్ కలెక్షన్స్ తో ట్రేడ్ కు షాకిస్తూ  దూసుకుపోతోంది. తొమ్మిది రోజుల్లో 159 కోట్లు వసూలు చేసింది. వీకెండ్ లలో దుమ్ము రేపింది.  ఫుల్ రన్ లో 200 కోట్ల గ్రాస్ ను అధిగమించేలా కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు.

జనం నవ్వుకోవటానికి పెద్ద కథ, కథనం అక్కర్లేదంటూ హౌస్ ఫుల్స్ చేసేస్తున్నా్రు.  మరో ప్రక్క విజయ్ హీరోగా వచ్చిన బిగిల్ (విజిల్) సినిమాది అదే పరిస్దితి. సినిమా బాగోలేదంటూ టాక్ నడుస్తోంది. కానీ 230 కోట్లు వసూలు చేసింది. వీకెండ్స్ లో ఈ సినిమా హౌస్ ఫుల్ రన్ నడిచింది. తమిళనాట ఈ సినిమాకు వంద కోట్లు వస్తే...అందులో కేవలం చెన్నైలోనే పది కోట్లు వసూలు చేసి ఆశ్చర్యపరిచింది.  కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేయటంతో రిపీట్ ఆడియన్స్  పెరిగారంటున్నారు. దసరాకు విడుదలైన వార్ విషయంలో కూడా ఇదే జరిగింది. వార్ కు క్రిటిక్స్ చాలా తక్కువ రేటింగ్స్ ఇచ్చినా .. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.  

Follow Us:
Download App:
  • android
  • ios