ప్రముఖ మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మ‌హిళా ప్రపంచ క్రికెట్‌లో అద్భుతంగా రాణించి తన సత్తా చాటిన మిథాలీ రాజ్ తెలుగమ్మాయి కావడం విశేషం.

క్రికెట్‌‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా రికార్డ్ సాధించింది. భారత క్రికెట్ కి ఎన్నో సేవలందించిన ఆమె జీవితం ఆధారంగా దర్శకుడు రాహుల్‌ థోలాకియా ఓ సినిమా రూపొందిస్తున్నాడు. 'కహానీ', 'క్వీన్‌', 'మేరీకోమ్‌', 'పద్మావత్‌' వంటి ఉమెన్‌ సెంట్రిక్‌ సినిమాలు తీసిన వయాకామ్‌ 18 సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.

స్టార్ హీరో ఇంట విషాదం..!

'శభాష్‌ మిథు' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో నటి తాప్సీ.. మిథాలీ రాజ్‌ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.  ఇందులో తాప్సీ .. మిథాలీ పాత్ర‌లో ఒదిగిపోయింది. స్టైలిష్ షాట్ కొడుతున్న‌ట్టుగా క‌నిపిస్తుంది.  

2021 మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఫస్ట్ లుక్ చూసిన మిథాలీ రాజ్.. తాప్సీని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో.. 'నా కథకు వెండితెరపై నువ్ లైఫ్ ఇస్తావని భావిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది.