బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ వరుసకి సోదరి అయిన నూర్ జెహాన్(52) మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. పాకిస్తాన్ లోని పెషావర్ లో మంగళవారం నాడు ఆమె తుదిశ్వాస విడిచారు. జెహాన్ తండ్రి షారుక్ కి పినతండ్రి అవుతారు.

నూర్ జెహాన్ పెషావర్ కిస్సా ఖ్వానీ బజార్ సమీపంలోని మొహల్లా షా వాలి కతాల్ ప్రాంతంలో నివసిస్తున్నారు. కొంతకాలంగా ఆమె నోటి క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారని ఆమె భర్త ఆసిఫ్ బుర్హాన్ చెప్పారు.

సీనియర్‌ నటి జమీలా ఇక లేరు!

నూర్ మరణించిన విషయాన్ని ఆమె సోదరుడు మన్సూర్ అహ్మద్ సైతం ధ్రువీకరించారు. అదే విధంగా షారుఖ్ ఫ్యామిలీతో నూర్ జెహాన్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

వీరికి భారత్ లో కూడా చాలా మంది బంధువులు ఉన్నారు. నూర్ మరణించడంతో షారుఖ్, నూర్ జెహాన్ తో కలిసి దిగిన ఫోటోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.