లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా 'తప్పడ్'. అనుభవ్ సిన్హా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో తాప్సీ ఇల్లాలి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో తాప్సీ భర్తగా పవైల్ గులాటి నటిస్తున్నారు.

ఈ సినిమాలో అతడి పాత్ర కీలకంగా ఉంటుంది. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో తాప్సీ సినిమా సంగతుల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కథ ప్రకారం సినిమా కీలక సన్నివేశంలో పవైల్ గులాటి.. తాప్సీని చెంపదెబ్బ కొట్టాలి.

'అర్జున్ రెడ్డి' చెంపదెబ్బకు కౌంటరా.. తాప్సి సమాధానం ఇదే!

తెరపై చూడడానికి అది ఒక్క చెంపదెబ్బే అయినప్పటికీ.. ఆ షాట్ చిత్రీకరించడానికి ఏడుసార్లు రీటేక్ చేశారట. ఇప్పటివరకు తన కెరీర్ లో అన్ని సార్లు ఏ సినిమా కోసం రీటేక్ చేయలేదని తాప్సీ చెప్పింది. సినిమాలో ఎంతో కీలకంగా ఉండే ఈ షాట్ కోసం మాత్రమే తను అన్నిసార్లు చెంపదెబ్బలు తిన్నానని తాప్సీ తెలిపింది.

ఆ షాట్ చాలా సహజంగా ఉండాలని డైరెక్టర్ చెప్పడంతో.. పెర్ఫెక్షన్ తో చేశామని తెలిపింది. షూటింగ్ సమయంలో పవైల్ తనను కొట్టడానికి చాలా భయపడ్డాడని.. ఇబ్బందిగా ఫీల్ అయ్యాడని.. ముందు తనను కొట్టమని అడిగేవాడని.. ఆ తరువాత భయంపోయి కొడతానని చెప్పేవాడు అంటూ షూటింగ్ విషయాలను పంచుకున్నాడు.

అయితే పవైల్ కొన్నిసార్లు తన మెడపై, మరికొన్నిసార్లు చెవిపై కొట్టేవాడని.. 'నువ్ మిగిలిన వాళ్ల గురించి ఆలోచించడం మానేసి.. నన్ను గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టు చాలని చెప్పేదాన్ని' అంటూ సినిమాలో కీలకమైన ఆ షాట్ గురించి చెప్పుకొచ్చింది.