టాలీవుడ్ లో హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసిన తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది. అక్కడ వరుస సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతుంది. ఆ మధ్య బాలీవుడ్ లో తాప్సీ నటించిన 'బద్లా' సినిమా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

అయితే ఈ సినిమా సమయంలో అమితాబ్ కంటే తనే ఎక్కువ కష్టపడ్డానని చెబుతోంది తాప్సీ. 'బద్లా' సినిమాకి తనే ఎక్కువ రోజులు పని చేశానని, ఆ సినిమా కోసం అమితాబ్ పని చేసిన రోజులు తక్కువ అని.. అయినా ఆ సినిమాని అమితాబ్ సినిమా అనే అంటారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

చిరు పార్టీలో బాలయ్య మిస్.. రీజనేంటి?

ఇదే సినిమాను తెలుగులో 'ఎవరు' అనే పేరుతో తీశారు. తెలుగు వెర్షన్ లో రెజీనా చేసిన పాత్రనే హిందీలో తాప్సీ చేసింది. అమితాబ్ పోషించిన పాత్రకి మార్పులు చేర్పులు చేసి అడివి శేష్ ఆ పాత్రలో నటించాడు. అయితే తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్ కే మంచి క్రేజ్ వచ్చింది. ఆ సినిమాలో అమితాబ్ పాత్ర ప్రధానంగా నడుస్తుంది.

ఆ సినిమా మార్కెటింగ్ కూడా చాలా వరకు అమితాబ్ పేరు మీదే జరిగింది. అలాంటి సినిమాలో తాప్సీకి ఓ ముఖ్య పాత్ర పోషించే ఛాన్స్ వచ్చింది. దానికోసం ఆమె ఎక్కువ రోజులు కష్టపడి ఉండొచ్చు కానీ ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తో పోల్చుకుంటూ అతడి కంటే తనే ఎక్కువ కష్టపడ్డానని.. చెప్పడం విడ్డూరంగా ఉంది. 

ఒకవేళ తాప్సీ అమితాబ్ కి బదులు ఎవరైనా చిన్న హీరోతో సినిమా చేసి ఉంటే అప్పుడు ఆమె సినిమాగా ప్రచారం వచ్చేది. అమితాబ్ లాంటి హీరో నటించిన సినిమాలో నెగెటివ్ రోల్ చేసి.. అది తన సినిమా అంటూ తాప్సీ చెప్పుకోవడం విమర్శలకు అవకాశం ఇచ్చినట్లు అవుతోంది.