1980'ల కాలంలో ఇండియన్ సినిమా ఫీల్డ్ లో చురుగ్గా కనిపించిన స్టార్స్ అందరు మళ్ళీ  అదే ఎనర్జీతో గత పదేళ్ల నుంచి కలుసుకుంటున్నారు. ఏదైనా వెకేషన్ కి వెళ్లడం లేదా ఎవరైనా ఒకరి ఆధ్వర్యంలో పార్టీ జరుపుకోవడం జరుగుతోంది. ఇక ఈ సారి మెగాస్టార్ హోస్ట్ గా పార్టీని ప్లాన్ చేసుకొని సీనియర్ తారలంతా హ్యాపీగా ఎంజాయ్ చేశారు.

అయితే ఈ పార్టీలో రావాల్సిన ముఖ్య తారాగణమంతా పాల్గొన్నప్పటికీ నందమూరి హీరో బాలకృష్ణ మాత్రం పాల్గొనలేదు. గతంలో రీ యూనియన్ పార్టీలకు బాలయ్య పెద్దగా మిస్సవ్వలేదు. చివరి నిమిషాల్లో అందరిని కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే మెగాస్టార్ ఇంటికి బాలకృష్ణ రాకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వెలువడుతున్నాయి.

అయితే బాలయ్య రాకపోవడం వెనుక పెద్దగా సందేహించాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. ఎందుకంటె బాలయ్య ప్రస్తుతం రూలర్ సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. ఆ సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా పనులు ఇంకా పూర్తవ్వలేదు. డబ్బింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అలాగే ప్రమోషన్స్ ప్లానింగ్స్ లో కూడా బాలయ్య రెగ్యులర్ గా చిత్ర యూనిట్ తో చర్చలు జరపనున్నారు.

మెంటల్ గా టార్చర్ చేశాడు.. ఇలియానా కామెంట్స్!

ఈ పనుల్లో బిజీగా ఉండడంతో బాలయ్య పార్టీకి హాజరు కాలేదని తెలుస్తోంది.  ఈ పార్టీలో లో జయరామ్, ప్రభు, సురేశ్, నదియా, రాధ, సరిత, అమల, జగపతిబాబు, జయసుధ, సుమలత, రెహమాన్, ఖుష్భూ, వెంకటేశ్, రాధిక, భానుచందర్, సుమన్, శోభన, నాగార్జున, రమేశ్‌ అరవింద్, జాకీ ష్రాఫ్, సుహాసిని, మోహన్‌లాల్, లిజీ, భాగ్యరాజ్, జయసుధ, శరత్‌కుమార్, వీకే నరేశ్ తదితరులు పాల్గొన్నారు. గోల్డ్ అండ్ - బ్లాక్ కలర్ డ్రెస్సుల్లో ఈ వేడుకలో ప్రతిఒక్కరు వారి గ్లామర్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.