మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 150 సినిమాలు ఒకెత్తు అనుకుంటే 151వ సినిమా సైరా న‌ర‌సింహారెడ్డి ఒక్క‌టీ ఒకెత్తు. ఆ సంగ‌తిని ఆయ‌నే అంగీక‌రించారు. అయితే సేమ్ టు సేమ్ స‌న్నివేశం అటు సురేంద‌ర్ రెడ్డిది కూడా. ఆయ‌న కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్లు ఉన్నాయి. కిక్ - రేసుగుర్రం- ధృవ లాంటి క్లాసిక్ హిట్స్ ని అందుకున్నాడు. అయితే అవ‌న్నీ ఒకెత్తు అనుకుంటే సైరా ఒక్క‌టీ ఒకెత్తు. ద‌ర్శ‌కుడిగా త‌న స్థాయిని ప‌దింత‌లు పెంచింది ఈ సినిమా.

పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా సూరిని ఆవిష్క‌రించింది. భారీ కాన్వాసుతో .. టెక్నాల‌జీ అప్ డేట్ తో రాజ‌మౌళిలా సినిమాని తీసే స‌త్తా ఉన్న ద‌ర్శ‌కుడిగా అత‌డిని ప్రూవ్ చేసింది సైరా. తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది సైరా. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. సైరా సినిమా చూసిన ప్ర‌తి ప్రేక్ష‌కుడు భాష‌తో సంబంధం లేకుండా గొప్ప సినిమా అని ప్ర‌శంసించారు.

బిగిల్ షో వేయలేదని ఫ్యాన్స్ బీభత్సం.. 37 మంది అరెస్ట్

కొన్నిచోట్ల పంపిణీదారుల‌కు ఆశించినంత రాక‌పోయినా నిర్మాత‌గా రామ్ చ‌ర‌ణ్ సంతృప్తిగానే ఉన్నారు. ఇది ద‌ర్శ‌కుడి విజ‌యం కిందే లెక్క‌. ఈ క్రెడిట్ అంతా సురేంద‌ర్ రెడ్డికే చెందుతుంది. ఒక మూల క‌థ‌ను తీసుకుని దానిని అంత గొప్ప‌గా తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో అత‌డు పెద్ద స‌క్సెస‌య్యాడు. టాలీవుడ్ లో ఎస్.ఎస్.రాజమౌళి- క్రిష్ లాంటి ద‌ర్శ‌కుల త‌ర్వాత ఆ త‌ర‌హాలోనే పాన్ ఇండియా సినిమా తీసి ఘ‌న‌వియం అందుకున్న ద‌ర్శ‌కుడిగా నిరూపించుకున్నాడు.

అయితే ఈ విజ‌యాన్ని ఆయ‌న ఎలా సెల‌బ్రేట్ చేసుకున్నారు..? అంటే .. ఈ గురువారం రాత్రి ఆయ‌న ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు- స‌న్నిహితులు- బంధు మిత్రుల‌కు అదిరిపోయే పార్టీని ఇచ్చారు. ఈ స‌క్సెస్ నేప‌థ్యంలో సూరి త‌దుప‌రి అడుగులు ఎలా ఉండ‌బోతున్నాయి?  మ‌రోసారి అత‌డు పాన్ ఇండియా సినిమానే తీస్తాడా? అన్న‌ది తేలాల్సి ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భాస్ - ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి స్టార్ల‌ను డైరెక్ట్ చేస్తాడ‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే స్క్రిప్టు దేనినైనా డిసైడ్ చేస్తుంది. సురేంద‌ర్ రెడ్డి త‌దుప‌రి ఎలాంటి స్క్రిప్టును రూపొందిస్తున్నారు? అన్న‌ది చూడాల్సి ఉంది.