ఓ పక్క అమరావతి ప్రాంత ప్రజలు రాజధానిని ఇక్కడే ఉంచాలని నిరసనలు చేస్తుంటే.. మరోపక్క వైజాగ్ లోనే రాజధానిని నిర్మించాలంటూ విశాఖవాసులు కోరుతున్నారు. ఈ క్రమంలో యాంకర్ రష్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

అయితే రష్మి పెట్టిన పోస్ట్ ఏపీ రాజధానికి సంబంధించినది కాదు. కేంద్రం నిర్వహిస్తోన్న స్వచ్చ సర్వేక్షణ్ 2020లో విశాఖపట్టణాన్ని నెంబర్ వన్ గా నిలపాలని రంగంలోకి దిగింది యాంకర్ రష్మి.  తన సొంతూరైన వైజాగ్ పై తనకున్న ప్రేమను తెలియజేస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో షేర్ చేసింది.

ఏపీ రాజధానిగా వైజాగ్.. అనుష్క, పూరి జగన్నాధ్ పై రూమర్స్ నిజమేనా?

స్వచ్చ సర్వేక్షణ్ 2020లో మన వైజాగ్ కూడా ఉందని.. వైజాగ్ నివాసిగా ఈ పోటీల్లో వైజాగ్ నెంబర్ వన్ గా నిలపాల్సిన బాధ్యత మనదేనని.. వైజాగ్ కే నా ఓటు అంటూ చెప్పుకొచ్చింది. అందరూ కూడా వైజాగ్ కి మద్దతు తెలపాలని కోరింది.

ఇది ఇలా ఉండగా.. ఈ పోటీలో దేశ 4370 సుందర నగరాలు పోటీ పడుతున్నాయి. ఈ నగరాలకు సంబంధించిన ప్రజలు ఓటింగ్ లో పాల్గొనవచ్చు. సోషల్ మీడియా ద్వారా ఓటు చేయవచ్చు.