సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి. అమరావతి ప్రాంత రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి వీల్లేదని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల ఏర్పాటు వైపే అడుగులు వేస్తోంది. 

ఇందులో భాగంగా విశాఖని కార్యనిర్వహణ రాజధానిగా, అమరావతిని శాసన నిర్వహణ రాజధానిగా, కర్నూలుని జ్యుడిషియల్ రాజధానిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైజాగ్ ప్రాంత వాసుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉండగా ఏపీ క్యాపిటల్ వివాదం నేపథ్యంలో టాలీవుడ్  ప్రముఖులపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

జగన్ నిర్ణయం వల్ల టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది పెద్ద ఎత్తున లబ్ది పొందబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆంగ్ల మీడియా సంస్థల్లో వస్తున్న కథనాల ప్రకారం.. పలువురు నిర్మాతలు, దర్శకులు, నటీనటులకు వైజాగ్ లో భూములు ఉన్నట్లు తెలుస్తోంది.  

పవన్, ప్రభాస్ కు అవసరం.. వాళ్లకు తప్పనిసరి.. మిస్సైతే అంతే సంగతులు!

దీనితో ప్రస్తుతం వైజాగ్ ఎలాంటి రాజధానిగా రూపొందుతుంది అనే అంశంపై తెలుగు సినీ ప్రముఖులు ఆసక్తిగా ఉన్నారు. నిర్మాత సురేష్ బాబుకు వైజాగ్ లో ల్యాండ్స్ ఉన్నాయి. ఆయన వైజాగ్ లో రామానాయుడు స్టూడియో నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ కూడా అదే తరహా ఆలోచనలో ఉన్నారు. జగన్ ప్రకటన తర్వాత వైజాగ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చే మార్పులపై వీరంతా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 

రామ్ తో తమిళ క్యూట్ హీరోయిన్ రొమాన్స్!

దర్శకుడు పూరి జగన్నాధ్, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిలకు వైజాగ్ లో భూములు ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు రాజమౌళి, మారుతిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక నందమూరి ఫ్యామిలిలో హరికృష్ణ చాలా ఏళ్ల క్రితమే వైజాగ్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు కూడా ఈ ప్రాంతంలో థియేటర్స్ ఉన్నాయి. ఇక  ఓ బడా సంస్థ స్టార్ హీరోతో కలసి మల్టిఫ్లెక్స్ నిర్మాణం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఏపీ క్యాపిటల్ వివాదంలో టాలీవుడ్ ప్రముఖులు హాట్ టాపిక్ గా మారారు.