హృతిక్ రోషన్ కు ఇండియా వ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధూమ్, క్రిష్ లాంటి చిత్రాలతో హృతిక్ రోషన్ బాలీవుడ్ లో సూపర్ హీరోగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. హృతిక్ గత ఏడాది నటించిన వార్ మూవీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా హృతిక్ దూసుకుపోతున్నాడు. 

కానీ హృతిక్ పర్సనల్ లైఫ్ లో అనేక వివాదాలు ఉన్నాయి. హృతిక్ రోషన్ తన మాజీ సతీమణి సుసాన్నె ఖాన్ నుంచి 2014 లో విడిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇద్దరు కుమారులు సంతానం. హృతిక్, కంగనా రనౌత్ మధ్య జరిగిన గొడవ కూడా బాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Black n white n grey. #signofthetimes #stayreal #tao #cantwaittogrowup #happytakeswork #sundayselfie

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on Mar 1, 2020 at 10:09am PST

భార్య భర్తలుగా విడిపోయినప్పటికీ తల్లి దండ్రులుగా హృతిక్, సుసాన్నె ఖాన్ ఫ్రెండ్ షిప్ మైంటైన్ చేస్తున్నారు. ఇటీవల వీరి మధ్య బంధం బలపడుతున్నట్లు కనిపిస్తోంది. పిల్లలతో కలసి వెకేషన్స్ కు వెళుతున్నారు. పలు ఈవెంట్స్ లో జంటగా కనిపిస్తున్నారు. దీనితో ఈ వీరిద్దరూ తిరిగి ఒక్కటి కాబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ హృతిక్, సుసాన్నె స్నేహితులుగా మాత్రమే కొనసాగుతున్నారు. 

తాజాగా హృతిక్ రోషన్ స్టైలిష్ లుక్ లో ఉన్న ఓ పిక్ ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. హృతిక్ రఫ్ లుక్ లో కనిపిస్తున్న ఈ సెల్ఫీ నెటిజన్లని ఆకట్టుకుంటోంది. కరణ్ జోహార్ లాంటి సెలెబ్రిటీలు కూడా హృతిక్ పిక్ పై కామెంట్స్ పెడుతున్నారు. ఈ పిక్ పై సుసాన్నె ఖాన్ కూడా కామెంట్ పెట్టింది. బ్లాక్ కలర్ హార్ట్ ఎమోజీలని పోస్ట్ చేసింది. దీనితో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

ఉత్కంఠ రేపుతున్న నాని 'శ్యామ్ సింగ రాయ్'.. కథ ఇదా!

ఇలా హృతిక్ రోషన్, సుసాన్నె ఖాన్ ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలు కురిపించుకుంటూనే ఉన్నారు. అలాంటప్పుడు విడాకులు రద్దు చేసుకుని ఒక్కటైపోవచ్చు కదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓ సందర్భంలో సుసాన్నె ఖాన్ తండ్రి, నటుడు అయిన సంజయ్ ఖాన్ కూడా ఇదే కోరుకున్నారు. నా కుమార్తె, హృతిక్ మధ్య జరిగిన సంగతులు పూర్తిగా వారి వ్యక్తిగతం. వాళ్లిద్దరూ ఎప్పుడూ బావుండాలనే కోరుకుంటాను. హృతిక్ రోషన్ పై నాకున్న గౌరవం ఎప్పటికి తగ్గదు అని సంజయ్ ఖాన్ ఓ సందర్భంలో అన్నారు.