నేచురల్ స్టార్ నాని వరుస చిత్రాలతో బిజీ అయిపోతున్నాడు. నాని ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శత్వంలో V చిత్రంలో, శివ నిర్వాణ దర్శత్వంలో 'టక్ జగదీశ్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నాని నటించబోయే మరో చిత్రానికి కూడా ప్రకటన వచ్చింది. అదే 'శ్యామ్ సింగ రాయ్'. 

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మాణంలో టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సంస్కృత్యాన్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. టైటిల్ తోనే ఈ చిత్రంపై అంచనాలు పెంచేశారు. శ్యామ్ సింగ రాయ్ అని టైటిల్ ప్రకటించడంతో నాని ఈ చిత్రంలో ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నాడా అనే చర్చ జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర కథ సంబంధించిన వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. 

ఈ చిత్రం పునర్జన్మల నేపథ్యంలో ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏ టైం పీరియడ్ లో ఈ చిత్రం ఉంటుందనేది మాత్రం తెలియలేదు. ఈ చిత్రంలో రెండు ప్రేమకథలు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఒక ప్రేమ కథ హైదరాబాద్ నేపథ్యంలో మరొకటి కోల్ కతా నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇష్క్ బ్యూటీ బొద్దుగా ఉన్నా అందమే (ఫొటోస్)

టాక్సీవాలా చిత్రాన్ని రాహుల్ ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చే కాన్సెప్ట్ తో మెప్పించాడు. ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ చిత్రం కూడా వైవిధ్యంగా ఉండేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. ఇక జెర్సీ లాంటి అద్భుత చిత్రం తర్వాత నాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నటిస్తున్న చిత్రం ఇది. త్వరలో ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.