Asianet News TeluguAsianet News Telugu

కూతురి మాటలకి ఏడ్చేసిన స్టార్ హీరోయిన్!

ఇటీవల తన దత్త పుత్రిక అలీషా తనను భావోద్వేగానికి గురి చేసిందని సుష్మితా సేన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. దానికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. 

Sushmita Sen's Daughter Alisah's Essay On Adoption 'Had Her In Tears'
Author
Hyderabad, First Published Nov 12, 2019, 2:28 PM IST

బాలీవుడ్ ముద్దుగుమ్మ సుష్మితా సేన్ తన 24 ఏళ్ల వయసులో ఓ అమ్మాయిని దత్తత తీసుకొని రీనా అని పేరు పెట్టుకొని పెంచుకుంటోంది. ఆ తరువాత అలీషా అనే మరో ఆడపిల్లను దత్తత తీసుకున్నారు. వీరిద్దరినీ సుష్మితా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఎప్పటికప్పుడు వారిపై ప్రేమ చూపిస్తూనే ఉంటుంది.

ఇటీవల తన దత్త పుత్రిక అలీషా తనను భావోద్వేగానికి గురి చేసిందని సుష్మితా సేన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. దానికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. అందులో పదేళ్ల అలీషా స్కూల్ వర్క్ లో భాగంగా తన తల్లిని ఉద్దేశిస్తూ మనసులోని మాటలు రాసింది.

హీరోయిన్ కి బెదిరింపులు..ఆ పుస్తకం బయటకి రాదా..?

'దత్తత' అనే అంశంపై అలీషా ఓ వ్యాసం రాసింది. దీన్ని చూసిన సుష్మిత ఎమోషనల్ అయింది. పాప తను రాసిన వ్యాసం చదువుతుండగా.. తీసిన వీడియోను సుష్మిత ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ''ఒక చిన్నారిని కాపాడి, జీవితం ఇచ్చావని అలియా రాసింది. తను నన్ను ఏడిపించేసింది. ప్రేమ, సంరక్షణ, స్వీకరణ, భద్రత, నిజాయితీలోని శక్తి ఇదని'' చెప్పుకొచ్చింది. 

పాపలోని నమ్మకం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని.. చిన్నారి తన మనసు విప్పి చెప్పిన మాటలు మీరూ వినండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దత్తత తీసుకోవడం అంటే హృదయం నుండి జన్మనివ్వడం అంటూ సుష్మిత రాసుకొచ్చారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios