కోలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఆండ్రియా. ఆమె నటించిన సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేయడంతో ఇక్కడి ప్రేక్షకులకు కూడా ఆమె దగ్గరైంది. ఈమెలో మంచి సింగర్, రైటర్ కూడా ఉన్నారు. కొన్ని చిత్రాల్లో పాటలు పాడారు. చివరిగా ఆమె నటించిన సినిమా 'వడ చెన్నై'. ఈ సినిమా తరువాత ఆమె తెరపై కనిపించలేదు. అలాంటిది ఆండ్రియా ఓ కార్యక్రమంలో పాల్గొని సంచలన కామెంట్స్ చేసింది.

తాను ఓ వివాహితుడితో సంబంధం పెట్టుకుని శారీరకంగానూ. మాసికంగాను ఎంతో బాధపడినట్లు చెప్పింది. అతడి నుండి బయటపడి ఆయుర్వేద చికిత్స పొంది ఉపశమనం పొందుతున్నట్లు పేర్కొంది. తనను మోసం చేసిన వ్యక్తి ఎవరనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.

హీరోయిన్ పై అక్కడ చెయ్యేసి ఫోటో... షాకైన ఫ్యాన్స్,కామెంట్ల వర్షం

అయితే ఆ వ్యక్తి ఎవరనేది తాను రాసుకున్న పుస్తకంలో బయటపెడతానని సంచలనం సృష్టించింది. అయితే ఇప్పటివరకు ఆ పుస్తకాన్ని విడుదల చేయలేదు. మానసికంగా క్షోభకి గురి చేసిన ఆ వ్యక్తి బెదిరించడం వలనే ఆండ్రియా తన పుస్తకాన్ని విడుదల చేయలేదనే ప్రచారం జరిగింది. ఆ వ్యక్తికి రాజకీయాలతో సంబంధాలు ఉన్నాయని.. సినిమా రంగంలోనూ ఉన్నాడని సమాచారం. 

పుస్తకం విడుదల తెలుసుకున్న ఆ వ్యక్తి ఆండ్రియాని బెదిరించినట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దీంతో ఆండ్రియా పుస్తకం బయటకి వచ్చే ఛాన్స్ లేదనిపిస్తోంది. మళ్లీ నటనపై దృష్టి సారించిన ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో అవకాశాలు బాగానే వస్తున్నాయి.

ప్రస్తుతం 'కావట్టం', 'మాళిగై' వంటి చిత్రాల్లో నటిస్తోంది. అలానే రీసెంట్ గా విజయ్ తో కలిసి నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో ఆమె హీరోయిన్ రోల్ కాకుండా ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది.