ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై ఆయన మేనమామ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదని, హత్య అని ఆర్సీ సింగ్ అన్నారు. సుశాంత్ సింగ్ మృతిపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తమకు రాష్ట్ర పోలీసులపై విశ్వాసం లేదని ఆయన అననారు. 

కొన్నాళ్ల క్రితం సుశాంత్ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సుశాంత్ మేనేజర్ ది కూడా ఆత్మహత్య కాదని, హత్యేనని ఆయన అన్నారు. ఓ నేషనలిస్టును హత్య చేశారని, సుశాంత్ మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని రాజ్ పుత్ మహాసభ డిమాండ్ చేస్తోందని ఆయన అన్నారు. 

Also Read: సుశాంత్ ఆ ఫోటోలు డిలీట్ చేయండి, లేకుంటే.. పోలీసుల వార్నింగ్

సుశాంత్ డిప్రెషన్ లోకి వెళ్లాడని, అందుకు ఆయన గత ఆరు నెలలుగా చికిత్స పొందుతున్నాడని పోలీసులు అంటున్నారు. సుశాంత్ ముంబైలోని బాంద్రాలో గల తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని ఆర్సీ సింగ్ మీడియాతో అన్నారు. 

సుశాంత్ మృతి వెనక ఏదో కుట్ర ఉండవచ్చునని, సుశాంత్ మృతిపై అనుమానాలున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం పోలీసులు సుశాంత్ ఇంటి పక్కల ఉన్నవారిని విచారిస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అతని ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు తెలిపాడు. 

Also Read: సినీ ఇండస్ట్రీ రాజకీయాలే సుశాంత్ ను బలితీసుకున్నాయి: పూనమ్ కౌర్

వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సుశాంత్ ఆ రోజు రాత్రి కొంత మంది మిత్రులతో ఉన్నట్లు తెలుస్తోంది. సుశాంత్ ఇంతటి చర్యకు ఎందుకు పాల్పడ్డాడో తెలియడం లేదని సుశాంత్ మిత్రుడు మనోజ్ చండిలా అన్నారు .తమతో ఎంతో ఆనందంగా గడిపిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నామని అన్నారు.