బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నా సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటన అందరినీ కలవరపరిచింది. సుశాంత్ మరణవార్తను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా.. ఆయన చనిపోయిన ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగా.. దీనిపై  మహారాష్ట్ర పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

సుశాంత్ డెడ్ బాడీ ఫోటోలను ఎవరూ షేర్ చేయవద్దని.. అలా చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ఒక వేళ ముందే షేర్ చేసి ఉంటే వాటిని డిలీట్ చేయాలని సూచించారు. 

కాగా.. కొంత మంది అభిమానులు సైతం ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తమ అభిమానిని అలాంటి స్థితిలో తాము చూడలేమని.. ఆ ఫోటోలను షేర్ చేయవద్దని కోరుతున్నారు. నటుడు సోనూసూద్ సైతం నెటిజన్లకు ట్విట్టర్ లో ఇదే విషయాన్ని తెలియజేశారు. సుశాంత్ డెడ్ బాడీ ఫోటోలు షేర్ చేయకండని కోరారు. వాటిని చూసి తట్టుకోలేకమని చెప్పారు.

ఇదిలా ఉండగా..  ముంబైలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.   సుశాంత్ సింగ్ ఎందుకు  ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలియాల్సి ఉన్నది.  సుశాంత్ సింగ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలుసుకున్న బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయ్యింది.  

ఎంఎస్ ధోని సినిమాతో సుశాంత్ సింగ్ మంచిపేరు తెచ్చుకున్నారు.  2008లో సుశాంత్ సింగ్ స్టార్ ప్లస్ లోని ఓ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యారు.  ఆ సీరియల్ మంచి విజయం సాధించడంతో సుశాంత్ సింగ్ పేరు మారుమ్రోగిపోయింది.  

ఆ తరువాత కై పో చెయ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుతుపెట్టారు.  ఈ సినిమా తరువాత శుద్ధ్ దేశీ రొమాన్స్, ఎంఎస్ ధోని, కేదారనాథ్, చిచ్చోరె సినిమాల్లో నటించి మెప్పించారు.  కొన్ని రోజుల క్రితమే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా సలిన్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.