బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో గత రెండు రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మంగళవారం సుశాంత్ తండ్రి కేకే సింగ్.. రియా చక్రవర్తి, ఆమె కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేశారు.

రియా ఆమె కుటుంబసభ్యులు సుశాంత్‌ను ఆర్ధికంగా మోసం చేశారని, మానసికంగా హింసించిందని కేకే సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో సుశాంత్ మాజీ ప్రియురాలు, నటి అంకిత లోఖండే స్పందించారు.

Also Read:సుశాంత్ ఆత్మహత్య: రియా గురించి విస్తుపోయే విషయాలు ఇవీ...

రియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిసిన కాసేపటికే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘ ట్రూత్ విన్స్ ’’ అనే ఇమేజ్‌ని పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు రియాపై వస్తున్న ఆరోపణల గురించి అంకితకు తెలుసునని.. అందుకు ఆమె ఇలా స్పందించారంటూ కామెంట్లు పెడుతున్నారు.

సుశాంత్ మరణం తర్వాతి నుంచి అంకిత ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా తన ఆలోచనలను సింబల్స్ ద్వారా వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిల్ బేచారా విడుదల సమయంలోనూ పవిత్ర ‘‘ రిష్తా టూ దిల్ బేచారా వన్ లాస్ట్ టైమ్’’ అంటూ పోస్ట్ చేశారు.

Also Read:తండ్రితో కట్ చేసింది: సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి దారుణాలు ఇవీ..!

సుశాంత్ పవిత్ర రిష్తా సీరియల్ ద్వారా చిత్ర సీమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దిల్ బేచారా అతని చివరి చిత్రం. 2009లో వచ్చిన పవిత్ర రిష్తా సీరియల్‌లో అంకిత, సుశాంత్ కలిసి నటించారు. ఈ క్రమంలో ప్రేమలో పడ్డ వీరు.. సుమారు ఆరేళ్ల పాటు ప్రేమించుకుని 2016లో విడిపోయారు.

సినిమాల్లో వరుసగా అవకాశాలు రావడంతో సుశాంత్.. అంకితకు మధ్య దూరం పెరిగిందని బాలీవుడ్ టాక్. అయితే అంకిత కూడా సినిమాల్లో నటించారు. కంగనా రనౌత్ నటించిన మణికర్ణికలో ఆమె కీలక పాత్ర పోషించారు. కాగా, అంకిత బిలాస్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త విక్కి జైన్‌ను ప్రేమిస్తున్నట్లు ప్రకటించారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on Jul 28, 2020 at 11:53pm PDT