సుశాంత్ ఆత్మహత్య: రియా గురించి విస్తుపోయే విషయాలు ఇవీ...
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలివుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలివుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జీ మీడియా అందుకు సంబంధించిన కొన్ని విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఆ మీడియా కథనం ప్రకారం... సుశాంత్ సింగ్, రియా చక్రవర్తి కలిసి Vividrage RhealityX Pvt అనే సంస్థను స్థాపించారు.
ఆ సంస్థకు రియా సోదరుడు షావిక్ చక్రవర్తి డైరెక్టర్ గా నియమితుడయ్యాడు. తన సోదరుడిని డైరెక్టర్ గా నియమించే విధంగా సుశాంత్ మీద ఆమె తీవ్రమై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంస్థను 2019 సెప్టెంబర్ లో ప్రారంభించారు. రియా ఒత్తిడి మేరకే కంపెనీ పేరులో Rhea అనే పదాన్ని చేర్చడానికి సుశాంత్ అంగీకరించినట్లు చెబుతున్నారు.
కంపెనీ ప్రారంభమైన రెండు నెలలకే సుశాంత్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం సుశాంత్ నలుగురు వైద్యులను విడివిడిగా సంప్రదించాడు. సుశాంత్ డిప్రెషన్ లో ఉండగానే షౌవిక్ యాక్టర్ తో కలిసి ఫ్రంట్ ఇండియా ఫర్ వరల్డ్ ఫౌండేషన్ పేర ఓ కంపెనీని స్థాపించారు. రెండు కంపెనీలకు ఇంటి చిరునామానే ఇచ్చారు. ఆ ఇంటిని రియా, షౌవిక్ తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి పేర్ల మీద రిజిష్టర్ చేసినట్లు జీ మీడియా రాసింది.
సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి కొద్ది రోజుల ముందు రియా Vividrage RhealityX Pvt Ltd కంపెనీ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఆ కంపెనీని పెద్ద యెత్తున అంధేరీ వెస్ట్ లో స్థాపించినట్లు సమాచారం. ఈ కోణంలో పోలీసు దర్యాప్తు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సుశాంత్ సింగ్ ఖాతా నుంచి 15 కోట్ల రూపాయలను రియా చక్రవర్తి ఖాతాలోకి రూ.15 కోట్లు బదిలీ అయినట్లు కేకె సింగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ స్థితిలో మూడు బ్యాంక్ ఖాతాల తనిఖీలు జరుగుతున్నాయి. సుశాంత్ సింగ్ ఖాతతో పాటు రియా, ఆమె తల్లి జాయింట్ ఖాతాను, షౌవిక్ ఖాతాను పరిశీలిస్తున్నారు.
తన ఫిర్యాదులో సుశాంత్ సింగ్ తండ్రి పేర్కొన్న పేర్లలో శ్రుతి మోడీ పేరు కూడా ఉంది. శ్రుతి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షౌవిక్ చక్రవర్తి మాజీ మేనేజర్ అని తెలుస్తోంది. శ్రుతీ మోడీని ముంబై పోలీసులు ఓసారి ప్రశ్నించారు. బీహార్ పోలీసులు ఆమెను ప్రశ్నించే అవకాశం ఉంది.