కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా నిజమైన హీరో అనిపించుకుంటున్నాడు. అగరం పేరుతో ఫౌండేషన్ నిర్వహిస్తున్న సూర్య పేద ప్రజలకు అన్ని విధాలుగా సహాయపడుతుంటాడు. ముఖ్యంగా అనాధ ఆడపిల్లలను చదివించి వారు ఒక కెరీర్ ని సెట్ చేసుకునే విధంగా ఒక సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నాడు.  అయితే రీసెంట్ గా ఒక వీడియోలో సూర్య ఎమోషనల్ అయినట్లు కనిపిస్తున్నారు.

ఆ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. ఒక అమ్మాయి ఇచ్చిన స్పీచ్ కి సూర్య భావోద్వాగానికి గురయ్యాడు. తల్లి తండ్రి అకాల మరణంతో ఒంటరిగా మిగిలిన తనను ఇంగ్లీష్ టీచర్ గా మార్చిన ఘనత ఆయనది అంటూ.. జీవితాంతం సూర్య గారికి ఋణపడి ఉంటానని ఆ మహిళ మాట్లాడింది. దీంతో సూర్య వెంటనే ఆమెను దగ్గరకు తీసుకొని ఎమోషనల్ అయ్యరు.

దీంతో కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ ఆడియెన్స్ని కూడా ఆ వీడియో ఎట్రాక్ట్ చేస్తోంది. సూర్యకు ఇలాంటి సహాయాలు చేయడం కొత్తేమి కాదు. గత కొన్నేళ్లుగా అనాధ పిల్లలని చేరదీసి వారి జీవితాల్లో వెలుగు నింపే విధంగా అడుగులు వేస్తున్నాడు. రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా సూర్య మరోసారి హీరో అనిపించుకున్నాడు. సూర్యని ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడటానికి ఇది కూడా ఒక కారణం.

పవన్ ఫ్యాన్స్ ని మరోసారి కెలికేసిన అల్లు అర్జున్!