గతంలో అల్లు అర్జున్ ఓ సినిమా ఈవెంట్ లో చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్ కి ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించాయి. మెగాహీరోల సినిమా వేడుకల్లో పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ అరవడం ఈ మధ్య తరచూ కనిపిస్తోంది. ఈ అరుపులపై హీరోలు అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అలా ఓ వేడుకలో పవర్‌ స్టార్‌ అనాలంటూ బన్నీని ఒత్తిడి చేశారు ఫ్యాన్స్‌. అయితే బన్నీ మాత్రం చెప్పను బ్రదర్‌ అంటూ రిప్లై ఇవ్వటంతో అది మెగా ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. తరువాత ఈ కామెంట్‌పై బన్నీని ట్రోల్ చేశారు మెగా ఫ్యాన్స్‌. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితే బన్నీకి ఎదురైంది.

ఘాటు చూపులతో హీటెక్కిస్తున్న నిధి అగర్వాల్!

తాజాగా ఈ హీరో నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమా మ్యూజికల్ కాన్సర్ట్ ని హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ వేడుక సినీ అభిమానులు, చిత్రబృందం మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ తన ఎమోషనల్ స్పీచ్ తో అభిమానులు ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో మరోసారి పవర్ స్టార్ అని కొందరు అరవడంతో బన్నీ రియాక్ట్ అయ్యాడు.

తనకు చిరంజీవి గారంటే ప్రాణమని.. చాలా మంది పవన్ కళ్యాణ్ గారి గురించి  మాట్లాడమంటున్నారని.. మీకోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటా అంటూ అసహనం వ్యక్తం చేశారు. అయిష్టంగానే పవన్ పేరుని పలికాడు. ఈ కట్ట కాలేంత వరకు చిరంజీవి ఫ్యానే.. అంటూ ఎమోషనల్ గా ఓ డైలాగ్ చెప్పారు. మెగాస్టార్ తరువాత టాలీవుడ్ లో ఆ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న హీరో పవర్ స్టార్. ఫ్యాన్స్ లో అతడికున్న క్రేజే వేరు. మెగాహీరోలు కూడా పవన్ గురించి గొప్పగా చెబుతుంటారు.

కానీ అల్లు అర్జున్ మాత్రం పవన్ టాపిక్ వస్తున్న ప్రతీసారి తన అయిష్టాన్ని బహిరంగంగా వ్యక్తపరుస్తున్నాడు. నిన్నటి ఈవెంట్ లో కూడా 'మీకోసం పవర్ స్టార్ అంటాను' అన్నాడే తప్ప తనకు చెప్పాలనిపించి అనలేదు. ఈ విషయం పవన్ ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తోంది. దీంతో సోషల్ మీడియాలో బన్నీకి వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతున్నారు.