Asianet News TeluguAsianet News Telugu

సురేష్ బాబు కొత్త ప్లాన్.. వెంకీ మామ రిలీజ్ ఎప్పుడంటే?

మల్టీస్టారర్ మూవీ వెంకిమామ రిలీజ్ డేట్ పై సురేష్ బాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా సినిమా రిలీజ్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అసలైతే సినిమా దసరా టైమ్ లోనే రావాలి. కానీ ఇంకా షూటింగ్ అయిపోలేదని చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వకుండా వచ్చింది.

suresh babu new planing on venky mama release date
Author
Hyderabad, First Published Oct 31, 2019, 2:02 PM IST

వెంకటేష్ - నాగ చైతన్య నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ వెంకిమామ రిలీజ్ డేట్ పై సురేష్ బాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా సినిమా రిలీజ్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అసలైతే సినిమా దసరా టైమ్ లోనే రావాలి. కానీ ఇంకా షూటింగ్ అయిపోలేదని చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వకుండా వచ్చింది.

దాదాపు డిసెంబర్ లోనే రిలీజ్ అవుతుంది అన్నట్లు కామెంట్స్ వచ్చాయి. కానీ ఆ తరువాత సంక్రాంతికి సిద్దమైనట్లు కథనాలు వెలువడ్డాయి. కానీ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు - అల వైకుంఠపురములో వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడంతో ఆ బాక్స్ ఆఫీస్ ఫైట్ నుంచి డ్రాప్ అయ్యారు.

suresh babu new planing on venky mama release date

మొత్తంగా వెంకిమామ సినిమాను జనవరి 25 తరువాత రిలీజ్ చేయాలనీ సురేష్ బాబు ఒక ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.  సంక్రాంతికే రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ థియేటర్స్ సమస్యతో పాటు సినిమా బడ్జెట్ కూడా కాస్త కంగారుపెడుతోంది.

మొదట వెంకీ మామ సినిమాను 30కోట్ల లోపే పూర్తి చేయాలనీ అనుకున్న సురేష్ బాబు ఆ తరువాత 40కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద మినిమమ్ కలెక్షన్స్ రాబట్టాలి.పాజిటివ్ టాక్ వచ్చినా ;కూడా ఈ రోజుల్లో పెట్టిన బడ్జెట్ వెనక్కి తీసుకురావడం అంత ఈజీ కాదు.  సో రిస్క్ లేకుండా జనవరి ఎండ్ లో సినిమాను రిలీజ్ చేయాలనీ సురేష్ బాబు కొత్త డేట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

also read:ఎప్పుడొస్తావ్ వెంకీమామ.. ఇంత భయమెందుకు?

త్వరలోనే అఫీషియన్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా వెంకటేష్ కి జోడిగా పాయల్ రాజ్ పుత్ నటించింది. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios