వెంకటేష్ - నాగ చైతన్య మల్టీస్టారర్ మూవీ వెంకీ మామ నుంచి మరో సాలిడ్ లుక్ విడుదలైంది. సినిమా పట్టాలెక్కినప్పటి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసుకుంటోంది. సినిమా విడుదల కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే  సినిమా రిలీజ్ డేట్ పై నేడు క్లారిటీ ఇస్తారని ఎదురుచూసిన ఆడియెన్స్ కి నిరాశ తప్పలేదు.  

గత కొన్ని రోజులుగా సినిమా రిలీజ్ డేట్ పై వస్తున్న రూమర్స్  కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నాయి. సంక్రాంతికి వస్తుందా? లేకుంటే ముందే క్రిస్మస్ కి వస్తుందా? అనే విషయం అర్ధం కావడం లేదు. దాదాపు సినిమాలన్నీవాటి రిలీజ్ డేట్స్ ని ఫిక్స్ చేసుకున్న్నాయి. డిస్కో రాజా - ప్రతి రోజు పండగే - రూలర్ సినిమాలు క్రిస్మస్ కి రానున్నాయి.

వస్తే విజయ్ దేవరకొండ కూడా తన వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాను అదే మూమెంట్ లో తేవచ్చని టాక్ వస్తోంది. అయితే దసరా నుంచి వాయిదాలు పడుతున్న వెంకీ మామ మాత్రం ఇంకా సరైన రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకోవడం లేదు.

దాదాపు సంక్రాంతికే ఫిక్స్ అనుకున్న సమయంలో అల్లు అర్జున్ - మహేష్ సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ యుద్ధం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఇక కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా అంటూ అప్పుడే దిగుతున్నాడు. అటు క్రిస్మస్ కి రాలేక - ఇటు సంక్రాంతిని వదల్లేక వెంకిమామ చాలా తికమకపడుతున్నాడు.

ఫైనల్ గా దీపావళికి ఎదో ఒక క్లారిటీ ఇస్తారనుకుంటే పోస్టర్ తో సరిపెట్టుకున్నారు. మరి అసలైన రిలీజ్ డేట్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సురేష్ బాబు ప్రొడక్షన్ లో రూపొందుతోంది. నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా వెంకటేష్ కు జోడిగా పాయల్ రాజ్ పుత్ కనిపించనుంది.